Homeఎంటర్టైన్మెంట్Radhika Sarathkumar: హీరోయిన్స్ క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు.. సీనియర్ నటి పేల్చిన బిగ్ బాంబ్ ఇదే

Radhika Sarathkumar: హీరోయిన్స్ క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు.. సీనియర్ నటి పేల్చిన బిగ్ బాంబ్ ఇదే

సినియన్ నటి రాధికా శరత్ కుమార్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల గురించి సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నేను 46 ఏళ్ల నుంచి ఉన్నాను. ప్రతి ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవు.

Radhika Sarathkumar: మలయాళ ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు లైంగిక వేధింపులకు గురయ్యారని.. ఇటీవల జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పలువురు నటీమణులు స్పందించారు. గతంలో వాళ్లు ఎదుర్కొన్న లైంగిక వైధింపుల గురించి ధైర్యంగా బయటకు చెప్పారు. దీంతో సెలబ్రిటీలను వేధించిన వాళ్లు పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ ఘటనపై అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు స్పందించారు. తాజాగా సమంత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేశారు. జస్టిస్ హేమ కమిటీలా టాలీవుడ్‌లో కూడా ఓ కమిటీ నియమించాలని ఆమె రేవంత్ రెడ్డిని కోరారు. ఇదిలా ఉండగా .. తాజాగా ఓ సీనియర్ నటి సినీ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

సినియన్ నటి రాధికా శరత్ కుమార్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల గురించి సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నేను 46 ఏళ్ల నుంచి ఉన్నాను. ప్రతి ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవు. ఇలాంటివే ఎదురువుతున్నాయని అనుకుంటున్నానను. ఓసారి నేను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాను. ఓ సినిమా షూటింగ్ కోసం గతంలో ఒకసారి కేరళ వెళ్లాను. షాట్ కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్తుంటే కొందరు పురుషులు కలిసి నవ్వుకుంటున్నారు. వాళ్లు ఫోన్‌లో ఏదో వీడియో చూస్తూ నవ్వుతున్నారు. ఇంతకీ వీళ్లు ఏం చూసి నవ్వుతున్నారని డౌట్ వచ్చి వేరే వాళ్లని పిలిచి.. ఎం చూసి నవ్వుతున్నారని అడిగాను. అప్పుడు ఒక అతను వాళ్లు క్యారవాన్‌లో సీక్రెట్‌గా కెమెరాలు పెట్టారు. మహిళల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి చూస్తున్నారని ఓ అతను చెప్పాడని ఆమె ఇంటర్వూలో తెలిపారు.

ఈ విషయం తెలిసిన వెంటనే రాధిక శరత్ కుమార్ చాలా టెన్షన్‌గా ఫీల్ అయ్యారు. ఇండస్టీలో ఇలాంటి వాళ్లు ఉంటారా అనిపించిందన్నారు. ఈ విషయాన్ని దాచుకోకుండా మిగతా నటీమణులకు చెబుతూ జాగ్రత్త ఉండమన్నారు. ఆ తర్వాత ఆమె మూవీ టీమ్‌కు కూడా కంప్లైంట్ చేశారట. అయితే ఈ సంఘటన తర్వాత ఆమెకు క్యారవాన్ ఉపయోగించాలంటే భయం వేసేదట. ఆ కేరళలో జరిగిన ఘటనే గుర్తు వచ్చేదని ఆమె తెలిపారు. ఇక అప్పటి నుంచి క్యారవాన్‌లో బట్టలు మార్చుకోవడం మానేశారు. అప్పటి నుంచి హోటల్‌లో మాత్రమే బట్టలు మార్చుకుంటున్నాని ఆమె తెలిపారు. షూటింగ్ టైమ్‌లో నటీమణులకు క్యారవానే ప్రైవేట్ ప్లేస్. కానీ ఇలా చేయడం దారుణమని ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. చాలామంది నటీమణులు ఇలాంటి సంఘటనలు ఫేస్ చేస్తునే ఉంటారు. కానీ బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారని ఆమె అన్నారు. రాధిక చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper