HomeజాతీయంNarendra Modi: ప్రధాని మోడీ చుట్టూ నిమ్మకాయలు.. మేకులు.. రంగంలోకి పోలీసులు.. ఏం జరిగింది..

Narendra Modi: ప్రధాని మోడీ చుట్టూ నిమ్మకాయలు.. మేకులు.. రంగంలోకి పోలీసులు.. ఏం జరిగింది..

Narendra Modi: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మౌ జిల్లా.. సరయు నది.. ఆ నది ఒడ్డున దేశ ప్రధాన మోడీ ఫోటో ఉంది. మామూలుగా అయితే ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చేది కాదు. కానీ ఆ ఫోటో చుట్టూ నిమ్మకాయలు ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మేకులు కూడా కనిపించాయి. అసలు ఇలా ఎందుకు ఏర్పాటు చేశారు.. ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని వెనక ఏముంది.. అసలు ఏం జరిగింది.. అనే కారణాలను ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన […]

Narendra Modi: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మౌ జిల్లా.. సరయు నది.. ఆ నది ఒడ్డున దేశ ప్రధాన మోడీ ఫోటో ఉంది. మామూలుగా అయితే ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చేది కాదు. కానీ ఆ ఫోటో చుట్టూ నిమ్మకాయలు ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మేకులు కూడా కనిపించాయి. అసలు ఇలా ఎందుకు ఏర్పాటు చేశారు.. ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని వెనక ఏముంది.. అసలు ఏం జరిగింది.. అనే కారణాలను ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి.

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాంత్రిక పూజలకు.. క్షుద్ర పూజలకు కొదవ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా క్షుద్ర పూజలు చేస్తుంటారు. వీటివల్ల అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయా.. ప్రయోజనాలు సొంతమవుతాయా.. అనే విషయాలను పక్కన పెడితే ఈ ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేయడం ఆనాదిగా వస్తోంది.

తాజాగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆ తరహా వ్యవహారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా సరయు నది ఒడ్డున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటుచేసి.. దాని చుట్టూ కొబ్బరికాయలు ఉంచారు. నిమ్మకాయలు కోసిపెట్టారు. ప్రత్యేకంగా మేకులు తయారుచేసి.. నరేంద్ర మోడీ ఫోటో చుట్టూ కొట్టారు. పసుపు కుంకుమ..ఇంకా కొన్ని పదర్థాలను అక్కడ ఉంచారు. చూసేందుకు ఆ ప్రాంతం భయానకంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రధాన మీడియాలో విస్తృతంగా చర్చలోకి వచ్చింది. దీంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు.. కేసు నమోదు చేశారు. అయితే ఈ పూజలు ఎవరు చేశారు? దాని వెనుక ఎవరున్నారు? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణను పక్కన పెట్టారని.. క్షుద్ర పూజలు చేసేవారిని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నేటి కాలంలో ఇటువంటి వాటికి ఆస్కారం ఉంటుందా.. అసలు క్షుద్ర పూజలను ఎవరైనా నమ్ముతారా అంటూ ఆప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఈ ఘటనపై బీజేపీ నాయకులు స్పందించారు. నరేంద్ర మోడీకి దేవతల ఆశీర్వచన బలం ఉందని.. ఆయనను ఇటువంటి క్షుద్ర పూజలు ఏనీ చేయలేవని వారు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper