Plumber Eye Plant: కలలు సాగు చేసుకోవాలంటే కన్నుల నీరు అవసరం.. గుండె బాధ తీరాలంటే కంటనీరు ఒలకాలి. సముద్రం దాటని మనిషి ఉంటాడేమో గాని.. కన్నీటిని దాటి జీవితాన్ని గెలిచిన మనిషి ఉండడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని కళ్ళు లేకుండా.. కన్నీరు ప్రస్తావన లేకుండా వివరించలేం. నేత్రాలు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగాలు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.
ఈ కథనంలో ఒక వ్యక్తి నేత్రం వల్ల అతని జీవితం రకరకాల మలుపులు తీసుకుంది. అతడు తన నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కానీ విధి రాసిన రాతవల్ల అతని కథ మతం మారిపోయింది. చివరికి అతని కంట్లో ఒక మొక్క మొలిచింది. అది ఏకంగా మూడు మిల్లీమీటర్ల మేర పెరిగింది. అయితే చూపు మందగించడంతో అతడు వైద్యులను సంప్రదించాడు. ఆ తర్వాత అసలు కథ ఏంటనేది బయటి ప్రపంచానికి తెలిసింది.
అతని కన్ను చూసేందుకు మాత్రమే కాకుండా.. ఒక మొక్క మొలవడానికి కారణమైంది. అతడి కన్నీరు ఆ విత్తనానికి ఆస్కారమైంది.. రష్యా ప్రాంతానికి చెందిన 42 సంవత్సరాల మాగ్జిమ్ స్లెప్ స్టోవ్ ప్లంబర్ గా పనిచేస్తుంటాడు. నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. కన్ను కూడా విపరీతంగా వాచింది. తట్టుకోలేక నేత్ర వైద్యుడిని సంప్రదించాడు.. పరీక్షించిన వైద్యుడు..”నీ కన్ను లో మొక్క మొలిచింది” అని ఆయన చెప్పగానే అతడికి ఒక్కసారిగా భయం అయింది. అలా మొక్క మొలవడానికి కారణం ఒకటుంది.
సరిగా ఈ ఏడాది జనవరిలో అతడు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక చెట్టుకొమ్మ అదడి ముఖానికి తగిలింది. కంట్లో ఏదో పడినట్టు అనిపించడంతో.. తన చేత్తో నలిపాడు. కొద్దిసేపటికి కన్ను ఎర్రగా మారింది. ఆ తర్వాత తగ్గిపోయింది. అయితే గడిచిన నాలుగు నెలల క్రితం నుంచి అతడికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఆ తలనొప్పి మొదట్లో ఒక స్థాయి వరకే ఉండేది. ఆ తర్వాత మరింత పెరగడంతో.. తట్టుకోలేక అతడు వైద్యుడిని సంప్రదించాడు. చివరికి ఆయన పరీక్షించి కంట్లో మొక్క మొలచిందని చెప్పడంతో.. అతడు భయపడ్డాడు. చివరికి శస్త్ర చికిత్స చేసి కంట్లో మలచిన మొక్కను తొలగించారు. ఆ మొక్క దాదాపు మూడు మిల్లీమీటర్ల పొడవు ఉంది. వాస్తవానికి ఆ విత్తనం నేత్రం లోపలి భాగంలో పడింది. ఆ విషయాన్ని ఆ ప్లంబర్ గుర్తించలేదు. తలనొప్పి కూడా మొదట్లో మాములుగానే ఉండేది. ఆ తర్వాత తీవ్రం కావడంతో అసలు విషయం బయటపడింది.