Prasanth Varma Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు గొప్ప సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రశాంత వర్మ (Prashanth Varma) లాంటి దర్శకుడు హనుమాన్ (Hanuman) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికి ఆయన సాధించిన ఈ విజయం అతనికి గొప్ప గుర్తింపును అయితే తీసుకువచ్చింది. కానీ తన తదుపరి సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే బాలయ్య బాబు కొడుకుతో చేయాల్సిన సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందనే వార్తలైతే వస్తున్నాయి. దాంతో పాటుగా ఆయన ఇప్పటికే జై హనుమాన్ సినిమా చేయాల్సి ఉంది. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్నప్పటికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికి ఈ సినిమాకి సంబంధించిన షూట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా విషయంలో కూడా ప్రశాంత్ వర్మ చాలావరకు లేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకని ఆయన ఇలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కట్టప్ప ను తీసేసిన స్టార్ డైరెక్టర్…ఇది కదా అభిమానం అంటే..?
మొత్తానికైతే ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. అతని దగ్గర టాలెంట్ ఉన్నప్పటికి ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి అటు డైరెక్షన్ ఇటు ప్రొడక్షన్ రెండు చూసుకోవాడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడు.
దీనివల్ల భారీ ప్రాజెక్టులు కూడా చేయి జారిపోతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడిగేయాల్సిన అవసరమైతే ఉంది.హనుమాన్ సినిమాతో సాధించిన సక్సెస్ ని క్యాష్ చేసుకునే విధంగా మరికొన్ని సినిమాలను తీసిన తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌజ్ నిర్మించుకుంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం అతనికి సలహాలు ఇచ్చినప్పటికి వాటిని పట్టించుకోవడం లేదు.
ఆయన కేవలం ప్రొడక్షన్ హౌజ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు మంచి విజయాలను సాధించినప్పటికీ వాళ్లెవరూ ఇలాంటి ఓవర్ యాక్షన్ అయితే చేయలేదని సినిమా మేధావులు చెబుతున్నారు…