Prasanth Varma Film Career: సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన వాళ్లకు మాత్రమే ఇక్కడ స్టార్ డమ్ దక్కుతోంది. ముఖ్యంగా డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురు చూసే చాలామంది అప్ కమింగ్ డైరెక్టర్లు అవకాశం వస్తే చాలు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే సంకల్పం తో ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హనుమాన్(Hanuman) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఆయన చేసిన ఈ ఒక్క సినిమాతో ఆయన ఎంటైర్ కెరియర్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి బాలయ్య బాబు (Balayya Babu) తన కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా తనకే అప్పజెప్పాడు అంటే ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ‘జై హనుమాన్’ (Jai Hanuman) అనే సినిమాని కూడా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇటు జై హనుమాన్ సినిమాతో పాటు బాలయ్య బాబు కొడుకు సినిమాని కూడా స్టార్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఆ విషయం లో యంగ్ డైరెక్టర్స్ కంటే రాజమౌళి చాలా బెటర్…
అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకి కథలను కూడా వినిపిస్తున్నారట. మొత్తానికైతే బాలయ్య బాబు కొడుకుని మొదట ఇండస్ట్రీకి పరిచయం చేసిన తర్వాత మిగతా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకోవచ్చు కదా అంటూ ఆయన మీద కొంతమంది కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. హనుమాన్ సినిమా తర్వాత మరొక సినిమా అయితే స్టార్ట్ చేయలేదు.
ఆ మూవీ రిలీజ్ అయి సంవత్సరం దాటినప్పటికి ఎందుకని ఆయన మరొక సినిమా స్టార్ట్ చేయడం లేదు అనే విషయం అయితే ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిజానికి ఆయన ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి కొన్ని సినిమాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో అటు సినిమాలను నిర్మించడం ఇటు కొత్త సినిమాలను డైరెక్షన్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది ఏదైనా ఒక పని మాత్రమే పెట్టుకొని ఆయన ముందుకు సాగితే బాగుంటుంది.
రెండు పనులను ఒకేసారి చేస్తే ఆయన కెరీర్ అనేది డైలమాలో పడిపోయే ప్రమాదం అయితే ఉందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తద్వారా సినిమాలను డైరెక్షన్ చేస్తాడా? లేదంటే ప్రొడక్షన్ కి సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీగా ఉంటాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…