Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. టెర్రరిస్టులకు , సంఘ విద్రోహ శక్తులకు సపోర్టుగా మాట్లాడి అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ రావణ్ కి మద్దతుగా ఆయన గత కొద్దీ రోజుల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రావణ్ పై UAPA చట్టం పై కేసు నమోదైంది , దీనిపై గన్నవరం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత రావణ్ కి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. దీంతో బద్దలైన గుండెతో ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఆట మొదలైంది అంటూ తనదైన స్టైల్ లో వ్యంగ్యంగా నవ్వుతూ ఒక వీడియో ని విడుదల చేశారు.
ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘ఏంటో.. వరుసగా తప్పుడు కేసులు పెట్టి , నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇస్తే , UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా?, అంటే యువరాజు ని ప్రశ్నిస్తే దేశద్రోహం, వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ క్లియర్ గా అర్థమైంది. తర్వాత ఏంటి?, క్యారెక్టర్ అస్సాసినేషన్, ఇప్పటికే జన సైనికులు AI వీడియోలు చేసి మొదలు పెట్టేసారు . మీరేమి చేస్తారు , వాడి ఫోన్ మీ దగ్గర ఉంది , అందులో సమాచారాన్ని వక్రీకరించి , దాన్ని లీక్ చేస్తూ , ఆయన్ని ఇబ్బంది పెడుతూ , ఆ మూలంగా ఆయనకీ అండగా నిల్చున్న వాళ్ళని , ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టే ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి , దిగజారుతూ ఉండండి, ఎంత క్రిందకు దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మీ ఆట మొదలైంది, కానీ ఈ ఆటకు ముగింపు ప్రజలే చేస్తారు , గేమ్ ఆన్’ అంటూ చెప్పుకొచ్చారు.
రావణ్ ని ఒక అభినవ భగత్ సింగ్ లాగా అనుకొని ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లపై అతను చేసిన అత్యంత నీచమైన కామెంట్స్ , అదే విధంగా టెర్రరిస్టులకు సపోర్టు చేస్తూ అతను మాట్లాడిన మాటలని సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ ఈ సమాజానికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు?, మాటికొస్తే జనాలు చూస్తున్నారు అని అంటున్నారు, నిజంగానే జనాలు మీ బుద్ధి ని గమనిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. చూస్తుంటే రావణ్ ని రిమాండ్ కి పంపడం ద్వారా , అతని మొబైల్ లో ఉన్న సమాచారం మొత్తం బయటపడితే , తన బండారం ఎక్కడ లీక్ అవుతుందో అనే భయం ప్రకాష్ రాజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z
— Prakash Raj (@prakashraaj) July 6, 2026

