Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan: జోసెఫ్ రావణ్ తో వైసిపికి డ్యామేజ్!

Joseph Ravan: జోసెఫ్ రావణ్ తో వైసిపికి డ్యామేజ్!

Joseph Ravan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో.. తెలియదు కానీ.. సమాజం పై వ్యతిరేక ప్రభావం చూపే వారి విషయంలో ఆ పార్టీ మద్దతు చూస్తుంటే మాత్రం.. చాలామంది ఆ పార్టీకి దూరం కాక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే.. కొత్త రథం తెచ్చి పెడతామని.. రామతీర్థలో విగ్రహం ధ్వంసమైతే కొత్త విగ్రహం పెడతామని అప్పటి మంత్రి హోదాలో చాలా తేలిగ్గా మాట్లాడారు కొడాలి నాని. దాని […]

Joseph Ravan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో.. తెలియదు కానీ.. సమాజం పై వ్యతిరేక ప్రభావం చూపే వారి విషయంలో ఆ పార్టీ మద్దతు చూస్తుంటే మాత్రం.. చాలామంది ఆ పార్టీకి దూరం కాక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే.. కొత్త రథం తెచ్చి పెడతామని.. రామతీర్థలో విగ్రహం ధ్వంసమైతే కొత్త విగ్రహం పెడతామని అప్పటి మంత్రి హోదాలో చాలా తేలిగ్గా మాట్లాడారు కొడాలి నాని. దాని ప్రభావం హిందూమతంపై విపరీతంగా ప్రభావం చూపింది. మొన్నటి ఎన్నికల్లో చాలా నష్టం చేకూర్చింది. అయినా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జోసెఫ్ రావణ్ విషయంలో సమర్ధించి అడ్డగోలుగా బుక్ అయింది. జోసెఫ్ రావణ్ కుటుంబ సభ్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కోరి న్యాయ సహాయం అందించడం.. వైసీపీ లీడర్ టీం రంగంలోకి దిగి సాయం అందించడం మాత్రం ఆ పార్టీకి డ్యామేజ్ చేసింది. కచ్చితంగా దాని ప్రభావం ఆ పార్టీ చూడక తప్పదు.

* విష సంస్కృతికి ఆధ్యుడు..
హిందూ దేవుళ్లను దారుణంగా మాట్లాడారు జోసెఫ్ రావణ్. అయితే ఈ విష సంస్కృతి అన్నిచోట్ల ఉంది. దురదృష్టవశాత్తు ఏపీకి కూడా విస్తరించింది జోసెఫ్ రావణ్ ద్వారా. ఒక మతాన్ని ఆచరించడంలో తప్పులేదు. గౌరవించడంలో అస్సలు తప్పులేదు. కానీ మరో మతాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ ఉండదు. అది సమ్మతం కూడా కాదు. కానీ జోసెఫ్ రావణ్ అదేపనిగా హిందూ మతాన్ని వ్యతిరేకించారు. కించపరిచారు. అసభ్య పదజాలాలతో దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. అటువంటి వ్యక్తిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకు రావడం చాలా తప్పు. ఆ తప్పిదానికి వ్యక్తిగతంగా ఆయనకు డ్యామేజ్ కలగవచ్చు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దారుణ డ్యామేజ్ జరగడం ఖాయం ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉంది. ఇప్పుడు దానిని రెట్టింపు చేసుకుంటోంది ఆ పార్టీ.

* హిందుత్వ నమ్మకం పై దాడి..
ఏదైనా భావజాలాన్ని ప్రదర్శించడం వేరు. సమర్ధించడం వేరు. హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించడమే కాదు. ఆ సమాజం చిన్నబోయేలా.. వారి ఆధ్యాత్మిక నమ్మకం పై దెబ్బతీసేలా జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలు నడిచాయి. అనవసరంగా ఆ వివాదాన్ని తలకు ఎక్కించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం ఎపిసోడ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. జోసెఫ్ రావణ్ కు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం రంగంలోకి దిగడం.. ఆ పార్టీకి జోసెఫ్ రావణ్ విషయంలో ఉన్న ప్రత్యేక శ్రద్ధ బయటపడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వైఖరి పై హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం సమయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. అటువంటి వ్యాఖ్యలకే డ్యామేజ్ జరిగితే… జోసెఫ్ రావణ్ లాంటి వారి వ్యాఖ్యలకు ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper