spot_img
Homeఎంటర్టైన్మెంట్Salaar: సలార్ మూవీ లో డ్యూయల్ రోల్ లో కనపించబోతున్న ప్రభాస్...ఇదిగో ప్రూఫ్...

Salaar: సలార్ మూవీ లో డ్యూయల్ రోల్ లో కనపించబోతున్న ప్రభాస్…ఇదిగో ప్రూఫ్…

Salaar: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన అనిమల్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మరో సినిమా భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంటుంది అదే ప్రభాస్ హీరో గా వస్తున్న సలార్…ఈ సినిమా నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమం లో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక అందులో భాగంగా ట్రైలర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగులకి ప్రభాస్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. అయితే ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ట్రైలర్ లోనే చెప్పాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ దేవా క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు.ఇక అందులో భాగంగానే తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దేవా ఏం చేయబోతున్నాడు అనేది ఈ సినిమా కథాంశంగా ఈ సినిమా అనేది తెరకెక్కింది. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమాలో దేవా, సలార్ అనే రెండు పాత్రల్లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది.

అందుకే సలార్ గెటప్ ఒకలా ఉంది దేవా గెటప్ మరోలా ఉంది. ఇక ఈ రెండు క్యారెక్టర్ లని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఆ విషయం క్లియర్ గా తెలుస్తుంది అంటూ భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రేక్షకులు అలాగే ప్రభాస్ అభిమానులు కోరుకున్నట్టుగా ఈ సినిమాలో ఇద్దరు ప్రభాస్ లు ఉంటే మాత్రం సినిమా అనుకున్న రేంజ్ కంటే మరింత ఎక్కువ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవా, సలార్ ఇద్దరూ పాజిటివ్ క్యారెక్టర్లు అయి ఉండి ఇద్దరు కూడా శత్రువులపై పోరాటం చేస్తుంటే అభిమానులు థియేటర్లో విజిల్స్ వేస్తూ అరుపుల మధ్య ఈ సినిమాను చూస్తారు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడున్న సమయంలో ప్రభాస్ కి ఈ సినిమా విజయం అనేది చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్ లు అవడంతో ప్రభాస్ మార్కెట్ కొంతవరకు తగ్గింది. దానివల్ల ఇప్పుడు ఈ సక్సెస్ తో మరోసారి ప్రభాస్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper