బుట్ట బొమ్మ గా `ఆల వైకుంఠపురం లో` అలరించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇపుడు పెద్ద హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అంతేకాదు భారీగా పారితోషికం తీసుకొంటోంది . కూడా ….ప్రస్తుతం ఈ బ్యూటీ అక్కినేని అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తోంది. అందుకు గాను హీరోకంటే ఎక్కువ పారితోషకం తీసుకొంటోంది. ఈ చిత్రంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 20 వ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. తమిళం నుండీ కూడా పెరియపడంలో నటించమని ఆఫర్లు వస్తున్నాయి. అదంతా నాణానికి ఒక వైపు ,ఇక రెండో వైపు చూస్తే ఈ బుట్టబొమ్మ సీరియల్ హీరో కం మోడల్ అయిన రోహాన్ మెహ్రాతో ప్రేమలో పడిందని కొన్ని నిశ్చల చిత్రాలు చూసాక అనుకోక తప్పట్లేదు .
ఒకనాటి బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు అయిన రోహన్ మెహ్రా హిందీలో పెద్ద స్టార్ కాదు. జస్ట్ మోడల్ మాత్రమే . మధ్యలో కొన్ని సీరియల్స్ లో నటించి కాస్తో కూస్తో పేరు సంపాదించాడు.
అలాంటి ` బుల్లి ` తెర నటుడితో పూజా హెగ్డే.. డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ధ్రువీకరిస్తూ ఇప్పుడు కొన్ని ఫోటోలు దర్శన మిచ్చాయి. ముంబై లోని కొన్ని ప్రదేశాలలో పూజా హెగ్డే , రోహన్ మెహ్రా కలిసి ఉండగా.. కొందరు ఫాన్స్ తమ ఫోన్లతో క్లిక్ మనిపించారు. అదీ సంగతి …
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pooja hegde in a relationship with rohan mehra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com