Jana Nayagan censor problem : మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం ఇప్పుడు విడుదల అవుతుందా లేదా అనేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు. మేకర్స్ సెన్సార్ కి స్లాట్ బుక్ చేసుకొని వారం రోజులైంది. ఈ పాటికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యి సర్టిఫికేట్ చేతుల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఒకపక్క ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో భారీ లెవెల్ లో జరిగాయి. ఓవర్సీస్ కి KDM’s డెలివరీ ఈరోజు అయిపోవాలి. లేదంటే ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. మరో పక్క ఇండియా లో ఈపాటికే QUBE, UFO కి సినిమా కంటెంట్ వెళ్ళిపోవాలి. ఇదంతా జరగాలంటే ముందు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వాలి.
అది ఇప్పటి వరకు జరగలేదు. మూవీ టీం కి సహనం నశించి హై కోర్టు లో సెన్సార్ బోర్డు తీరుపై కేసు వేశారు. రేపు ఈ కేసు విచారణకు రానుంది. హై కోర్టు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. విజయ్ ప్రస్తుతం TVK పార్టీ ని స్థాపించి రాజకీయాల్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు మూడు నెలల్లో తమిళనాడు వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం పై విజయ్ తన సభల్లో ఏ రేంజ్ లో విమర్శలు చేస్తున్నాడో జనాలు చూస్తూనే ఉన్నారు. తమ ప్రభుత్వానికి విజయ్ వ్యతిరేకంగా వస్తున్నాడు కాబట్టే, అతని సినిమాని సీఎం స్టాలిన్ ఇలా ఇబ్బంది పెడుతున్నాడని , ఆయన కారణంగానే ఈ సెన్సార్ బోర్డు ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదని విశ్లేషకుల నుండి వినిపిస్తున్న వాదన.
ఎన్నికల సమయం లో ఇలా విజయ్ ని ఇబ్బంది పెడితే, సినిమాకు నష్టం జరగొచ్చేమో కానీ, రాజకీయంగా స్టాలిన్ విజయ్ కి మేలు చేసినట్టే అవుతుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం లో ఇలాంటి సంఘటనలు చాలానే చూసాము. పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ రానివ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఏ రేంజ్ లో తొక్కేసిందో జనాలు చూసారు. వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ప్రత్యేక్యంగా ఒక ఉదాహరణ చూసిన తర్వాత కూడా స్టాలిన్ ఇలా చేస్తే మాత్రం చాలా తెలివి తక్కువ పని అంటూ విశ్లేషకులు అంటున్నారు. ఇక ‘జన నాయగన్’ విషయానికి వస్తే ఈ సినిమా బాలకృష ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా, విజయ్ కి కూతురు పాత్రలో మమిత బైజు నటించింది.