Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: కేవలం గంటలో అభిమాని నిరంజన్ కోరినవి కొనిచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan: కేవలం గంటలో అభిమాని నిరంజన్ కోరినవి కొనిచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan: నేడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన గురించే చర్చ సాగింది. 17 ఏళ్ళ యువకుడు చాలా కాలం నుండి ట్రీట్మెంట్ లేని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బ్రతికేది చాలా తక్కువ కాలం అని డాక్టర్లు సైతం చెప్పుకొచ్చారు. అలాంటి సమయం లో తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ ని చూడడం అని ఆ యువకుడు కోరగా , నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ […]

Pawan Kalyan: నేడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన గురించే చర్చ సాగింది. 17 ఏళ్ళ యువకుడు చాలా కాలం నుండి ట్రీట్మెంట్ లేని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బ్రతికేది చాలా తక్కువ కాలం అని డాక్టర్లు సైతం చెప్పుకొచ్చారు. అలాంటి సమయం లో తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ ని చూడడం అని ఆ యువకుడు కోరగా , నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ విషయాన్నీ తెలియజేయడం కోసం ఆ కుర్రాడి తల్లిదండ్రులు , బంధు మిత్రులు పడిన కష్టం మామూలుది కాదు. ఎట్టకేలకు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి తెలిసేలా చేశారు. దీంతో వెంటనే ఆయన నేడు వరంగల్ కి వెళ్లి , ఆ కుర్రాడిని కలిసి , అతనితో , అతని కుటుంబం తో చాలా సమయం గడిపాడు.

దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ , ప్రేమ ని చూసి ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా చలించిపోయారు. ఇకపోతే ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ ని ఒక ఐపాడ్, రామ్ చరణ్ వద్ద ఉన్నటువంటి పుడుల్ జాతికి చెందిన పెంపుడు కుక్కని కావాల్సిందిగా కోరాడు. వీటిని పవన్ కళ్యాణ్ వరంగల్ నుండి వెళ్లిన గంటలోపే ఆ కుర్రాడికి అందేలా చేసాడు. దీంతో ఆ కుర్రాడు పడిన ఆనందాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరగక తప్పదు. ఉన్నది తక్కువ ఆయుష్షు , అయినప్పటికీ తనకు దొరికినటువంటి చిన్న చిన్న కానుకలకు అతను పడిన ఆనందాన్ని చూస్తుంటే , ప్రతీ ఒక్కరు జీవితం యొక్క విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఈ కుర్రాడు ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాడో తెలియదు కానీ , ఉన్నన్ని రోజులు కచ్చితంగా ఈరోజు జరిగిన సంఘటనలను తలచుకొని ఆనందంగా బ్రతుకుతాడు.

ఇకపోతే నిరంజన్ ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ , 5 లక్షల రూపాయిలు సహాయం చేస్తానని అధికారికంగా ప్రకటించాడు. అదే విధంగా ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘పంజా’ చిత్రాన్ని సెప్టెంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు కైలాష్ ఫిలిమ్స్ సంస్థ. ఈ సందర్భంగా నిరంజన్ కి తక్షణమే లక్ష రూపాయిల సాయం అందించాడు. అంతే కాకుండా, పంజా చిత్రం నుండి వచ్చే వసూళ్ళలో 5 శాతం ఆ కుర్రాడికి సహాయం గా అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న నిరంజన్ లేటెస్ట్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper