Inspirational story : మీరు ఎన్నో నీతి కథలను వినే ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఒక మంచి కథను తెలుసుకుందాం. అది మంచిదా చెడ్డదా? దాని వల్ల మీకు ఏంటి ప్రయోజనం అనే పూర్తి విషయాలు ఈ కథ చదివిన తర్వాత మీకే తెలుస్తుంది. అయితే ఒక గాడిదను తీసుకొని రైతు వెళ్తుంటాడు. దారి మధ్యలో ఓ బావి ఉంటుంది. దానిని చూసుకొని ఆ గాడిద బావిలో పడిపోతుంది. అది బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ పాపం లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోతుంది గాడిద.
ఇక రైతు కూడా ఆ గాడిదను బయటకు తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అది బయటకు రాలేదు. ఆ బావిలో నీళ్ళు లేవు. గాడిద కూడా ముసలి అయిపోయింది. సో దాన్ని బయటకు తీసి లాభం లేదని ఆ బావిలోనే పూడ్చి పెట్టాలి అనుకుంటాడు రైతు. సహాయం మరో నలుగురిని తీసుకొని వచ్చి అందులోకి మట్టి వేస్తాడు. పాపం ఆ గాడిద చాలా సేపు అరిచి అరిచి నీరసానికి వస్తుంది. సడన్ గా దాని అరుపులు కూడా వినిపించవు. ఆ గాడిద చనిపోయిందని నిర్ధారించుకున్న రైతు దగ్గరకు వెళ్లి చూస్తాడు.
మట్టిని మొత్తం తనకు బలంగా మార్చుకుంటూ ఆ మట్టిని పక్కకు చేస్తూ దాని మద్యలో నుంచి బయటకు వస్తుంది గాడిద. అంటే ఆ మట్టినే దానికి మెట్ల లాగా, బయటకు రావడానికి ఒక ఆయుధం లాగా చేసుకుంటూ చనిపోయే స్థితి నుంచి కూడా తిరిగి బయటకు వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ముసలి గాడిద కూడా ఎంతటి కష్టాన్ని దూసుకొని బయటకు వచ్చింది కదా.
ఇంతకీ ఈ కథలో మీకు ఏం అర్థం అయింది? ఇందులో చాలా నీతి దాగి ఉంది. ప్రస్తుత సమాజంలో ఏదైనా పని స్ట్రార్ట్ చేసినా, చేయాలి అనుకున్నా సరే విమర్శించే వారు, తిట్టే వారు, ఎదగకుండా చేసే వారు ఎక్కువ ఉన్నారు. వారి తిట్లను, విమర్శలను మెట్ల మాదిరి చేసుకుంటూ అవే ఆశీర్వాదాలు అనుకుంటూ పైకి రావాలి. అంతే కానీ వారి ఊబిలో ఇరుక్కుపోతే మాత్రం చివరకు వినాశనమే మీ సొంతం అవుతుంది.
ఆనందంగా జీవించాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే?
క్షమించడం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. దీని వల్ల మనసు సంతోషంగా, తేలికగా ఉంటుంది. అనవసర ఎమోషన్స్ నుంచి బయటపడవచ్చు.
సింపుల్ గా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. అవసరం లేని ఆడంబరాలు మీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తాయి.
ఆశలు తగ్గించుకోవాలి. లేదంటే నిరాశ ఎదురవుతుంది. దీని వల్ల లేనిపోని నెత్తి నొప్పి అని అర్థం చేసుకోండి.
అశాంతిని కలిగించే విషయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. శాంతినిచ్చే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.