Madhya Pradesh : ఎంతటి పేదవాడిని అయినా కూడా ధనవంతుల్ని చేయడంతో పాటు గౌరవం పొందేలా చేసేది చదువు మాత్రమే. ఈ ప్రపంచంలో చాలా మందికి తినడానికి తిండి లేకపోవడంతో పాటు చదువుకోవడానికి కూడా స్తోమత లేని వారు చాలా మందే ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు (Parents) ప్రతీ రూపాయి దాచి. వారిలా కాకుండా పిల్లలు గొప్పగా బతకాలని ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. తల్లిదండ్రులు (Parents) వారి ఇష్టాలను పక్కన పెట్టి పిల్లల కోసం జీవిస్తుంటారు. ఇలా వారు జీవితంలో ఓడిపోయి పిల్లలను గెలిపించిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో ధనవంతులతో పాటు పేద వాళ్లు కూడా ఉంటారు. ధనవంతుడు ఉద్యోగం సాధించారంటే తప్పకుండా నలుగురు మాట్లాడుకుంటారు. కానీ ఒక పేదవాడు ఉద్యోగం సంపాదించాడు అంటే చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. అయితే ఈసారి ఫలితాల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. అందులోనూ టాప్ 10లోనే వీరంతా ఉండటం విశేషం. అయితే ఈ ఫలితాల్లో కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు.. ప్రభుత్వం ఉద్యోగం సాధించి అందరు మెచ్చుకునేలా చేశారు. ఇంతకీ ఎవరీ ఆ వ్యక్తి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో ఆశిష్ సింగ్ చౌహాన్ అనే ఉద్యోగం సాధించాడు. ఇతని తండ్రి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే ఆశిష్‌ను ఎంతో కష్టపడి చదివించారు. తనలా పిల్లలు కాకూడదని.. ఎంత కష్టం వచ్చిన చదువు వదలకుండా చేశారు. మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాల్లో ఆశిష్ 841.75 మార్కులు సాధించి టాప్ 10లో నిలిచాడు. మొదటి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలుస్తోంది. కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆశిష్ ఎంపికయ్యాడు. తన విజయం అంతా కూడా తల్లిదండ్రుల పాత్రే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆశిష్ తెలిపాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పిల్లలను చదివించాడు. ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. ఆశిష్ అన్న బట్టల షాపులో పనిచేస్తున్నాడు. కుటుంబమంతా కూడా ఆశిష్‌కి అండగా నిలిచారు. వీరి వల్లే ఆశిష్ ఇంతటి విజయాన్ని సాధించినట్లు తెలిపాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్‌లోనే చదివాడు. ఆ తర్వాత బీఏ, ఎంఏ చేసి పీహెచ్‌డీ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తూ.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. రోజుకి దాదాపుగా 8 నుంచి 10 గంటలు చదివేవాడు. ఇలా కష్టపడి చదవడం వల్లే ఈ రోజు గొప్ప ఉద్యోగం వచ్చిందని ఆశిష్ తెలిపాడు.