Inspirational story : సమాజంలో అందరూ ఒకేలా ఉండలేరు. కొందరు ధనవంతులు కావచ్చు.. మరికొందరు పేదవారికి కావచ్చు.. ఇంకొందరు ఆరోగ్యంగా ఉండవచ్చు.. మరికొందరు వికలాంగులై ఉండవచ్చు. అయితే అన్ని రకాలుగా ధనం ఉండి.. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఏదో ఒక లోపంతో ఉంటారు. అలాగే వివిధ కారణాలవల్ల శరీరంలో ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే తమ లోపాన్ని పైకి చెప్పుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇంకొందరు తమకున్న లోపం గురించి ఎదుటివారికి చెప్పి సింపతి పొందాలని చూస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఎదుటివారు సింపతి మాత్రమే చూపిస్తారు. అలాకాకుండా మన దగ్గర ఉన్న ప్రతిభను ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేయాలి. అలా చెప్పినప్పుడు సింపతికి బదులు సపోర్టు చూపించి ఎక్కువగా ఆదరిస్తారు. ఇలాంటి విషయాన్ని తెలిపే ఓ కథ మీకోసం..
ఒక నగరంలో ఒక యాచకుడు ఇతరులను అడుక్కుంటూ ఉంటాడు. అయితే అతడు చూడలేక పోతాడు. దీంతో తన వెనకాల ఒకటి రాసి ఉంటుంది. నేను అందుడను.. నాకు సాయం చేయండి అని ఉంటుంది. ఇది చూసిన చాలామంది తమకు తోచిన సాయం చేసి వెళుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి అందుడి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతాడు.. రోజు నువ్వు అడుక్కునే డబ్బులు నీకు సరిపోతున్నాయా? అని అడుగుతాడు. దానికి ఆ యాచకుడు తనకు సరిపోవడంలేదని.. కొన్ని రోజుల్లో ఖాళీ కడుపుతోనే ఉంటున్నానని చెప్పాడు. అయితే ఇది విన్న ఆ వ్యక్తి అంధుడి వెనకాల ఉన్న బోర్డుపై అప్పటి వరకు రాసి ఉన్నదాన్ని చెరిపి వేయించాడు. ఆ తర్వాత మరొకటి రాసి వెళ్ళాడు.
మరుసటి రోజు ఆ అంధుడు ఎప్పటిలాగే తన స్థలంలో కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఆరోజు ముందు రోజు కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి. అలాగే ముందు రోజు వచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ ఈరోజు కూడా అతని దగ్గరికి వస్తాడు. వచ్చి మళ్లీ అడుగుతాడు. ఈరోజు వచ్చిన డబ్బులు సరిపోతాయా అని అంటాడు. దీంతో ఆ ఆంధ్రుడు.. తనకు నిన్నటి కంటే ఈరోజు ఎక్కువగా డబ్బులు వచ్చాయని చెబుతాడు. ఈ డబ్బులతో ఈరోజు సరిపోతాయని బదులిస్తాడు.
అప్పుడు ఆ వ్యక్తి నీ వెనకాల ఉన్న బోర్డులో వేరే రాశాను. అందుకే నీకు ఈరోజు ఎక్కువగా డబ్బులు వచ్చాయి అని చెబుతాడు. దీంతో ఆ యాచకుడు కాస్త అయోమయంగా ఉంటాడు. ఇంతకీ ఏం రాశారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి.. ఇంతకుముందు నేను అంధుడను అని రాశావు.. కానీ అలా రాయడం వల్ల నీ లోపాన్ని ఎదుటివారి చూసి బాధను వ్యక్తం చేశారు. కానీ ఆ బాధతో వారికి డబ్బులు వేయడానికి మనసు రాలేదు. దీంతో నేను వేరే రాశాను. అదేంటంటే.. ఈరోజు చాలా అందమైనది.. కానీ..నేను ఈ లోకాన్ని చూడలేకపోతున్నాను.. అని రాశాను. ఇలా రాయడం వల్ల ఎదుటివారు ఏమి కోల్పోతున్నారు..? నీ దగ్గర లేనిది వారి దగ్గర ఏమున్నది? అనే విషయం వారికి అర్థమవుతుంది. దీంతో వారు తమకు తాముగా గొప్పగా అనుకొని.. అది రాసినందుకు నీకు సాయం చేయాలని ఇలా డబ్బులు వేశారు అని చెప్పాడు.
అంటే ప్రతి వ్యక్తి కి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని తలుచుకోకుండా అంతకుమించి తాను ఎలా అదృష్టవంతుడు అనుకొని ముందుకు సాగాలి. అంతేకాకుండా చాలా విషయాలు ఇతరులకు లేనిది మన దగ్గర ఉన్నది అని అనుకోవాలి. అప్పుడే పాజిటివ్ థింకింగ్ వచ్చి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతాం.