Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Fans: ఢిల్లీ నాయకులను భయపెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. దద్దరిల్లిపోయింది సభ.. వీడియో...

Pawan Kalyan Fans: ఢిల్లీ నాయకులను భయపెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. దద్దరిల్లిపోయింది సభ.. వీడియో వైరల్..

Pawan Kalyan Fans: ‘ఓజీ’ మూవీ ఆరంభం లో ‘హడలెను ఊరు..విని తనపేరు.. ఓజాస్.. గంభీర’ అనే బ్యాక్ గ్రౌండ్ వోకల్స్ తో ఒక మ్యూజిక్ వస్తుంది గుర్తుందా?, సోషల్ మీడియా లో కూడా ఆ షాట్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని ఓజాస్ గంభీర పాత్ర ఎంత పవర్ ఫుల్ అని చెప్పడానికి ఉపయోగించినట్టు గా అనిపించడం లేదు, హీరో పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో చెప్పే డైలాగ్ గా అనిపించింది. ఏ […]

Pawan Kalyan Fans: ‘ఓజీ’ మూవీ ఆరంభం లో ‘హడలెను ఊరు..విని తనపేరు.. ఓజాస్.. గంభీర’ అనే బ్యాక్ గ్రౌండ్ వోకల్స్ తో ఒక మ్యూజిక్ వస్తుంది గుర్తుందా?, సోషల్ మీడియా లో కూడా ఆ షాట్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని ఓజాస్ గంభీర పాత్ర ఎంత పవర్ ఫుల్ అని చెప్పడానికి ఉపయోగించినట్టు గా అనిపించడం లేదు, హీరో పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో చెప్పే డైలాగ్ గా అనిపించింది. ఏ సభ లో అయినా సరే , ఆయన పేరు వినిపిస్తే చాలు , ‘బాహుబలి 2’ చిత్రం లోని ఇంటర్వెల్ సన్నివేశం రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పట్లో అడవి శేష్ పవన్ కళ్యాణ్ పేరుని ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎత్తగానే సభా ప్రాంగణం మొత్తం ఏ స్థాయిలో దద్దరిల్లిపోయిందో మన కళ్లారా చూశాం.

జనాల నుండి వచ్చిన ఆ రెస్పాన్స్ ని చూసి రాజమౌళి సైతం సైతం పట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. రీసెంట్ గానే ‘పెద్ది’ మూవీ విజయోత్సవ సభ లో నిర్మాత పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము . ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విచ్చేసిన చిరంజీవి సైతం షాక్ కి గురయ్యే పరిస్థితి ఏర్పడింది , డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే చెవులు మూసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే నేడు కూడా రిపీట్ అయ్యింది. నేడు ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతం లోని రైల్వే కోడూరు లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘VB-G RAM-G’ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచ్చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. శివరాజ్ చౌహాన్ తో పాటు , ఢిల్లీ నుండి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ సభ కి విచ్చేసారు. అందులో ఒక నాయకుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాడు అంతే, సభా ప్రాంగణం మొత్తం జనాల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఒక 40 సెకండ్ల పాటు ఆయన్ని మాట్లాడనివ్వలేదు. దీంతో ఆ ఢిల్లీ నాయకుడు ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి , ఇలాంటివి అన్నీ ఇక్కడ మామూలే , మీ ప్రసంగాన్ని కొనసాగించండి అని చెప్పిన విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ ‘VB-G RAM-G’ స్కీం విషయానికి వస్తే , ఈ పధకం ద్వారా దేశం లోని పేద ప్రజలకు 125 రోజుల పాటు పని కల్పించనున్నారు, నేటి నుండి ఈ పధకం అమలులోకి రానుంది. ఈ పధకానికి అర్హులైన కూలీలకు రోజుకి 312 రూపాయిల వేతనాన్ని ఖరారు చేశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper