Homeఎంటర్టైన్మెంట్Trisha Pet Dog: త్రిష పెంపుడు కుక్క ఆ యంగ్ హీరోదా ..? సీక్రెట్ లీక్...

Trisha Pet Dog: త్రిష పెంపుడు కుక్క ఆ యంగ్ హీరోదా ..? సీక్రెట్ లీక్ అయిపోయిందిగా..

Trisha Pet Dog: సౌత్ ఇండియాలో ప్రస్తుతం త్రిష పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎదో ఒక అంశం లో ఆమె పేరు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది . ఒకపక్క వరుస బ్లాక్ బస్టర్స్ ని చేస్తూ , కెరీర్ పరంగా పీక్ రేంజ్ లో ఉంది , మరోపక్క ఆమె ప్రియుడు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , ప్రస్తుతానికి ఆమె కలలో కూడా ఊహించని […]

Trisha Pet Dog: సౌత్ ఇండియాలో ప్రస్తుతం త్రిష పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎదో ఒక అంశం లో ఆమె పేరు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది . ఒకపక్క వరుస బ్లాక్ బస్టర్స్ ని చేస్తూ , కెరీర్ పరంగా పీక్ రేంజ్ లో ఉంది , మరోపక్క ఆమె ప్రియుడు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , ప్రస్తుతానికి ఆమె కలలో కూడా ఊహించని జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు త్రిష పెంపుడు కుక్క కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిపోయింది. ప్రముఖ యంగ్ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్రిష పెంపుడు కుక్కకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నేను ఎక్కడా చెప్పలేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఉన్నతివంటి పెంపుడు కుక్క పేరు ‘టెడ్డీ’. ఇది పుడుల్ జాతికి చెందిన కుక్క. దీని కూతురే ఇప్పుడు త్రిష వద్ద పెరుగుతోంది. తన భార్య జ్వాలా గుత్తా త్రిష కి బెస్ట్ ఫ్రెండ్. వాళ్లిద్దరూ తరుచూ కలుస్తుంటారు. ఎక్కువగా కుక్కల గురించి మాట్లాడుకునేవారు. వాళ్ళ మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం వల్లే , నా భార్య త్రిష కి ‘టెడ్డీ’ కూతుర్ని బహుమతిగా ఇచ్చింది. ఈ సీక్రెట్ ని రెవీల్ చేసినందుకు త్రిష ఏమనుకోదని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు విష్ణు విశాల్. త్రిష కి కుక్కలు అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు ఒక ఉదాహరణ కూడా ఉంది. రీసెంట్ గా తన వ్యక్తిగతం విషయాలపై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేసేవారికి త్రిష చాలా గట్టి కౌంటర్ ఇచ్చింది. నా వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత కేవలం నా పెంపుడు కుక్క కి మాత్రమే అనుమతి ఉంది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

మరి విష్ణు విశాల్ రెవీల్ చేసిన ఈ సీక్రెట్ కి త్రిష కౌంటర్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే విష్ణు విశాల్ రీసెంట్ గా ‘మట్టి కుస్తీ 2’ అనే చిత్రం చేసారు. ‘మట్టి కుస్తీ’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా , రేపు తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం లో కూడా ఐశ్వర్య లెక్ష్మి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా విష్ణు విశాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పై విషయాన్ని చెప్పుకొచ్చారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper