Homeఎంటర్టైన్మెంట్బాలయ్యకి ఓ నిర్మాత కావాలి !

బాలయ్యకి ఓ నిర్మాత కావాలి !

బాలయ్య బాబు.. ఈ పేరు వింటేనే యాక్షన్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకువస్తాయి. పైగా పదేళ్ల క్రితం వరకూ బాలయ్య కూడా టాప్ హీరోనే. కాకపోతే ప్రస్తుతం బాలయ్య బాబుకు ఏవరేజ్ హీరో రేంజ్ మార్కెట్ కూడా లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ బాలయ్య సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయి. అందుకే బాలయ్య మార్కెట్ ఎప్పుడూ.. ఆయనతో కలిసి పని చేసే డైరెక్టర్లను బట్టే […]

Balakrishna New Movie
బాలయ్య బాబు.. ఈ పేరు వింటేనే యాక్షన్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకువస్తాయి. పైగా పదేళ్ల క్రితం వరకూ బాలయ్య కూడా టాప్ హీరోనే. కాకపోతే ప్రస్తుతం బాలయ్య బాబుకు ఏవరేజ్ హీరో రేంజ్ మార్కెట్ కూడా లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ బాలయ్య సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయి. అందుకే బాలయ్య మార్కెట్ ఎప్పుడూ.. ఆయనతో కలిసి పని చేసే డైరెక్టర్లను బట్టే డిసైడ్ అవుతూ ఉంటుంది. అందుకే బాలయ్య సినిమా ప్రొడ్యూసర్లు కాస్త ఆలోచించి బడ్జెట్ పెడుతూ ఉంటారు. అందుకే ప్రస్తుతం బాలయ్య బాబు సినిమాకి నిర్మాత దొరకడం లేదు.

Also Read: ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

నిజానికి బాలయ్య, తన తరువాత సినిమాని బి.గోపాల్ తో చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమాకి నిర్మాత దొరకడం లేదు. అందుకే ఈ సినిమాని బాలయ్య ఎప్పుడో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నా.. కేవలం నిర్మాత దొరకకపోవడం వల్లే.. ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేస్తున్నాడు. అయినా.. బాలయ్య మాత్రం గోపాల్ లాంటి ఫామ్ లో లేని డైరెక్టర్లతో పని చేయడం మాత్రం మానడు. అదే బోయపాటి, క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ అయితే బాలయ్య సినిమాకి ముందే మార్కెట్ అయిపోతుంది. అయినా బాలయ్య మాత్రం వారితో తన తరువాత సినిమాలను ప్లాన్ చేసుకోకుండా.. ప్లాప్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ లు ఇచ్చి ఉన్న మార్కెట్ ను కూడా కిల్ చేసుకుంటూ ఉంటాడు.

Also Read: నాని కొత్త ప్రయోగం.. ‘అంటే సుందరానికీ’ మోషన్ పోస్టర్ రిలీజ్..!

గత ఏడాది వచ్చిన బాలయ్య రూలర్ సినిమా పరిస్థితి తరువాత.. కొంతమంది నిర్మాతలు కూడా బాలయ్యకు దూరం జరిగారు. బాలయ్యతో సినిమా కంటే.. కొత్త హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. నిజానికి బాలయ్యతో సి కళ్యాణ్ మరో సినిమా ప్లాన్ చేశాడు. బి.గోపాల్ తో సినిమా చేద్దాం అని అనగానే బాలయ్యకు కళ్యాణ్ దూరం జరిగాడు. అసలు సి.కళ్యాణ్ సినిమా అంటే బాలయ్య రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోరు. అయినా.. కళ్యాణ్ సినిమాని నిర్మించడానికి ముందుకు రావడానికి కారణం.. ప్లాప్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా చేస్తే.. ఇక ఆ సినిమాకి నష్టాలు తప్పితే.. లాభాలు రావు అనేది శాసనం లెక్క. అందుకే బాలయ్య – గోపాల్ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper