Homeఎంటర్టైన్మెంట్NTRNeel: అతి తక్కువ ధరకు #NTRNeel రైట్స్ ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ.....

NTRNeel: అతి తక్కువ ధరకు #NTRNeel రైట్స్ ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ.. ఎంతో తెలుసా?

NTRNeel: గత కొంత కాలం నుండి ఓటీటీ సంస్థలు తీవ్రమైన నష్టాలను ఎదురుకుంటూ వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ ని సైతం డామినేట్ చేస్తూ, ఇండస్ట్రీ కి తీవ్రమైన నష్టాలను కలిగించే రేంజ్ ప్రభావం చూపిన ఓటీటీ సంస్థలు, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయాయి. అందుకే నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. నిర్మాతలకు ఒకప్పుడు థియేటర్స్ రన్ తో సంబంధం లేకుండా, వాళ్ళు పెట్టిన డబ్బులు కేవలం ఓటీటీ రైట్స్ నుండే వచ్చేవి. కానీ […]

NTRNeel: గత కొంత కాలం నుండి ఓటీటీ సంస్థలు తీవ్రమైన నష్టాలను ఎదురుకుంటూ వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ ని సైతం డామినేట్ చేస్తూ, ఇండస్ట్రీ కి తీవ్రమైన నష్టాలను కలిగించే రేంజ్ ప్రభావం చూపిన ఓటీటీ సంస్థలు, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయాయి. అందుకే నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. నిర్మాతలకు ఒకప్పుడు థియేటర్స్ రన్ తో సంబంధం లేకుండా, వాళ్ళు పెట్టిన డబ్బులు కేవలం ఓటీటీ రైట్స్ నుండే వచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటివి పరిస్థితులు లేవు. అందుకే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు కూడా అతి తక్కువ రేటు కి అమ్ముడుపోతున్నాయి. అలా తక్కువ రేటుకి అమ్ముడుపోయిన చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్. ఈ సినిమాపై మార్కెట్ లో ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. అలాంటి సినిమా ఓటీటీ రైట్స్ డిమాండ్ ప్రకారం కనీసం 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవాలి. ఎందుకంటే ‘దేవర’ చిత్రాన్నే నెట్ ఫ్లిక్స్ సంస్థ 135 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది కాబట్టి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం కేవలం 100 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్ముడుపోయింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ కు నెట్ ఫ్లిక్స్ లో భారీ రేంజ్ లో వ్యూస్ కూడా వచాయి. అంత సక్సెస్ ఫుల్ చిత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కేవలం 100 కోట్లకు అమ్ముడుపోవడం ఆశ్చర్యార్ధకం. అది కూడా కొన్ని షరతుల మీదనే కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్ సంస్థ.

ఈ వంద కోట్ల రూపాయిలు విడుదలకు ముందు ఇవ్వరట. కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇస్తారట. విడుదల తర్వాత థియేటర్స్ లో ఈ చిత్రం సాధించే వసూళ్ల ఆధారంగానే డబ్బులు చెల్లిస్తారని టాక్. సినిమా హిట్ అయితే వంద కోట్ల రూపాయిలు ఇస్తారు, లేదంటే సగానికి పైగా డబ్బులు తగ్గించేస్తారట. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా పరిస్థితే ఇలా ఉంటే, ఇక మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి ఏంటో గమనించండి. ఒక్కసారిగా ఓటీటీ బిజినెస్ ఇంతలా పడిపోవడాన్ని చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్ లో జరుగుతోంది. ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించి మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper