Homeఎంటర్టైన్మెంట్Actor Naresh: సీనియర్ హీరో నరేష్ తన కొడుక్కి ఇచ్చే పాకెట్ మనీ తో 4...

Actor Naresh: సీనియర్ హీరో నరేష్ తన కొడుక్కి ఇచ్చే పాకెట్ మనీ తో 4 కుటుంబాలు బ్రతకొచ్చు తెలుసా..

Actor Naresh: టాలీవుడ్ లో సీనియర్ హీరో నరేష్ కి ఉన్నటువంటి సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కామెడీ హీరో గా రాజేంద్ర ప్రసాద్ తో సరిసమైనమైన ఇమేజ్ ని సంపాదించుకొని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న నరేష్, తన మార్కెట్ మొత్తం పోయాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన […]

Actor Naresh: టాలీవుడ్ లో సీనియర్ హీరో నరేష్ కి ఉన్నటువంటి సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కామెడీ హీరో గా రాజేంద్ర ప్రసాద్ తో సరిసమైనమైన ఇమేజ్ ని సంపాదించుకొని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న నరేష్, తన మార్కెట్ మొత్తం పోయాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత నరేష్ కి దక్ఖిణాన్ని అద్భుతమైన పాత్రలు ఏ సీనియర్ నటుడికి కూడా దక్కలేదు అనడం లో అతి సయోక్తి లేదు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో నరేష్ కచ్చితంగా ఉండాల్సిందే , అలా తయారైంది పరిస్థితి. కేవలం ఆయన నటన కారణంగా సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లిన సినిమాలు కూడా ఈమధ్య కాలం లో చాలానే ఉన్నాయి.

ఇకపోతే నరేష్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులకంటే ఎక్కువగా, వ్యాపారాల ద్వారానే సంపాదించారు. అంతే కాకుండా తన తల్లి విజయ నిర్మల నరేష్ పేరిట ఎన్నో ఆస్తులు సమకూర్చింది. రీసెంట్ గానే నరేష్ ఒక పెద్ద బంగ్లా ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చాలా గ్రాండ్ గా సినీ ప్రముఖులను ఆహ్వానించి గృహ ప్రవేశం కూడా చేశారు నరేష్. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇకపోతే నరేష్ కి నవీన్ అనే కొడుకు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన 2016 వ సంవత్సరం లో ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే చిత్రం ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేశారు. ఈ చిత్రం తర్వాత ఆయన మరో సినిమాలో కనిపించలేదు. ఇదంతా పక్కన పెడితే ఆయన లివింగ్ స్టైల్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న నాకు నెలకు 4 లక్షల రూపాయిలు పాకెట్ మనీ లాగా ఇస్తుంటారు. కానీ అందులో సగం EMI లకే పోతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు యాంకర్ ఆశ్చర్యపోతూ ‘ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసులైన మీరు EMI లు కట్టడం ఏంటి’ అని అడగ్గా, అందుకు నవీన్ సమాధానం చెప్తూ ‘తప్పేమి ఉంది. ఇలాంటివి చెయ్యాలి. సిబిల్ స్కోర్ బాగుంటుంది , ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా అని తగేలేయలం కదా. ఒక సిస్టం ఉంది , బ్యాంక్ మనకు లోన్స్ ఇస్తుంది , దాన్ని మనం ఉపయోగించుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడారో ఈ క్రింది వీడియో లో చూడండి. నెలకు 4 లక్షల రూపాయిల పాకెట్ మనీ అంటే , నాలుగు మధ్యతరగతి కుటుంబాలు ఆ డబ్బులతో ఒక నెల బ్రతికేయొచ్చు, అంతే కాకుండా ఎంతో కొంత డబ్బులను దాచి పెట్టుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper