Garividi Lakshmi Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారుని రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గారివిడి విజయలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ ఎలా ఉందంటే
చిన్నతనంలోనే తండ్రికి దూరమైన లక్ష్మి (ఆనంది) జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటుంది.. 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగినప్పటికీ భరత మోసం చేయడంతో తిరిగి తల్లి దేవుడమ్మ ( రాశి) దగ్గరకు చేరుతుంది. చిన్నప్పటినుంచి పాటలపై లక్ష్మికి ఆసక్తి ఉంటుంది. అందువల్లే ఆమె బుర్రకథలు నేర్చుకుంటుంది. సత్యం (రాగ్ మయూర్) బృందంలో చేరుతుంది. బాలనాగమ్మ కథను పాడి.. మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ జానపద గాయనిగా ఎదుగుతుంది. అయితే నమ్మిన వారి మోసాలు ఆమె జీవితాన్ని.. ఎలా మార్చాయి.. గుర్తింపు కోసం ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది మిగతా కథ..
నటీనటుల పనితీరు ఎలా ఉందంటే
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా నటించింది. ఆమెను తప్ప ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోయింది. సీనియర్ యాక్టర్ నరేష్, రాగ్ మయూర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాశి, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సినిమా ఎలా ఉందంటే
గౌరీ నాయుడు ఫోక్ సాంగ్స్ పాడే ఆర్టిస్ట్ లైఫ్ ను అత్యంత సహజంగా ఆవిష్కరించింది. ఫస్టాఫ్ లో లక్ష్మి ఎదుగుదలను ఆసక్తికరంగా చూపించింది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా పాటలు ఆకట్టుకుంటాయి. 1990 ల ఉత్తరాంధ్ర వాతావరణం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఆవిష్కరించింది. అయితే కొన్ని పాత్రలు ఎంపిక.. కథనం మరింత మెరుగ్గా ఉంటే ఇంకా బాగుండేది.
మొత్తానికి గరివిడి లక్ష్మి ఒక మంచి ప్రయత్నం. ఆనంది నటన.. జానపద సంగీతం.. భగవద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. కళాకారుల జీవితాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో.. ఈ కాలం వారికి దగ్గరగా చేసే ప్రయత్నం చేశారు. కమర్షియల్ హంగులను పక్కన పెడితే.. రియల్ లైఫ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక ఉత్తమమైన ఎంపిక.
ఓకే తెలుగు రేటింగ్: 3/5