Homeఎంటర్టైన్మెంట్Spider Man Brand New Day Review: 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ఫుల్...

Spider Man Brand New Day Review: ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

Spider Man Brand New Day Review: హాలీవుడ్ సినిమాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి ఆదరణ దక్కుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మార్వెల్ పేరు చెబితే చాలు ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు ‘స్పైడర్ మాన్ బ్రాండ్ న్యూ డే’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం […]

Spider Man Brand New Day Review: హాలీవుడ్ సినిమాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి ఆదరణ దక్కుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మార్వెల్ పేరు చెబితే చాలు ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు ‘స్పైడర్ మాన్ బ్రాండ్ న్యూ డే’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

న్యూయార్క్ నగరాన్ని కాపాడుతూ వచ్చిన స్పైడర్ మాన్ పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) తన ఐడెంటిటి బయటపడడంతో తన వాళ్లని చెప్పుకునే వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలగచ్చనే ఉద్దేశంతో తను ఐడెంటిటిని వదిలేసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ జీవితంలో ఆయన ఎలాంటి ఇబ్బందులను అనుభవించాడు. తన మానసిక పరిస్థితి ఎలా మారింది. ఫైనల్ గా డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డాడు…ఇక ఈ క్రమంలోనే జీన్ (శాండీ సింక్) వల్ల న్యూయార్క్ కి ఎలాంటి ప్రమాదం వాటిల్లింది… దాన్ని పీటర్ పార్కర్ ఎలా ఎదుర్కున్నాడనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

స్పైడర్ మాన్ సినిమా అంటే మనకు భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కారణం ఏంటంటే ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి నగరాన్ని కాపాడుకుంటూ వచ్చిన స్పైడర్ మాన్ ని చూసి మనందరం క్లాప్స్ కొడుతూనే ఉంటాము. స్పైడర్ మాన్ మనం చేయలేని పనులన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి అతన్ని చూడడానికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అలాగే నిజజీవితంలో మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనకు కూడా స్పైడర్ మాన్ లాంటి శక్తులు ఉంటే బాగుండేది మనం కూడా మన ప్రాబ్లమ్స్ లో సొల్యూషన్ చూపించుకునే వాళ్ళం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇంతకు ముందు స్పైడర్ మాన్ లా కాకుండా ఇది చాలా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేశారు. స్పైడర్ మాన్ కి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆయన మానసిక పరిస్థితి బాగుండదు. ఆయన కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాలను ఇందులో చాలా కులంకషంగా చూపించారు. అలాగే తను ఒక సామాన్యుడిలా జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా చర్చించారు… ఇక ఇంతకుముందు స్పైడర్ మాన్ సిరీస్ లో వచ్చినట్టుగా నాన్ స్టాప్ యాక్షన్స్ సన్నివేశాలు, హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్స్ ఈ సినిమాలో లేవు. దీనిని పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ గా మార్చారు.

మొత్తానికైతే హీరోకి, విలన్ కి సపరేట్ బ్యాక్ స్టోరీస్ ఉండడం అందులో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు… ఎమోషన్ కంటెంట్ ఎక్కువైనా కూడా అది ప్రతి ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు ఈ కంటెంట్ ను చాలా ఎఫెక్టివ్ గా చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు…

స్పైడర్ మాన్ పాత్రను పోషించిన టామ్ హాలండ్ అద్భుతం గా నటించాడు…జీన్ అనే నెగిటివ్ పాత్రను పోషించిన శాండీ సింక్ సైతం బెస్ట్ విలనిజాన్ని ప్రదర్శించింది. మొత్తానికైతే ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ సిరీస్ లలో మాదిరిగా ఇందులో యాక్షన్ సన్నివేశాలు లేకపోయిన కూడా పెర్ఫెక్ట్ విజువల్స్ తో సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది…మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ఎడిట్ వర్క్ కూడా పెర్ఫెక్ట్ సింక్ లో ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ టాప్ నాచ్ లో ఉంది…

రేటింగ్ : 3.25/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper