Mokshagna launch date: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన స్క్రీన్ మీద ఒక సింహం లా కనిపిస్తాడు. అతని డైలాగ్ డెలివరీ కి ఫిదా కానివారు ఉండరు… నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ప్రేక్షకులందరిని మెప్పించడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. మాస్ హీరోగా అవతరించడమే కాకుండా బీ,సీ సెంటర్లో ఉన్న ప్రేక్షకులందరిని మైమరిపింపజేసేలా తన డైలాగులతో వాళ్లను అలరించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ మోస్ట్ హీరోగా మార్చాయి. అలాంటి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో వైవిధ్యాన్ని చూపిస్తున్నప్పటికి ఆయన సినిమాలు కొన్ని సక్సెస్ మరికొన్ని ప్లాపులుగా మారుతున్నాయి…
ఇతని కొడుకు అయిన మోక్షజ్ఞను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నప్పటికి ఇప్పటివరకు అది కార్యరూపమైతే దాల్చలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలు ఇచ్చినప్పటికి అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు దసర కి మోక్షజ్ఞ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట.
వచ్చే ఏడాది సమ్మర్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓపెనింగ్ రోజే సినిమా రిలీజ్ డేట్ ని కూడా చెప్పబోతున్నారట. నిజానికైతే బాలయ్య బాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు… మోక్షజ్ఞ సైతం ఈ గ్యాప్ లో నటనకు సంబంధించిన మెలుకువలను నేర్చుకోవడమే కాకుండా డాన్సులు సైతం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేశారట.
మొదటి సినిమాతో తనలోని పూర్తి నటుడిని బయటికి తీయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకుంటాడా? మొదటి సినిమాతోనే హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…