Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu: నాకు లాగేస్తుంది.. అది లేకుండా ఉండలేను అంటూ జగపతిబాబు హాట్ కామెంట్స్

Jagapathi Babu: నాకు లాగేస్తుంది.. అది లేకుండా ఉండలేను అంటూ జగపతిబాబు హాట్ కామెంట్స్

Jagapathi Babu: ఇకప్పుడు హీరోగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న జగపతి బాబు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో , లేడీస్ లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఈయనే అని అంటుంటారు విశ్లేషకులు. అయితే హీరో గా మార్కెట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాక , ఆయన విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి , […]

Jagapathi Babu: ఇకప్పుడు హీరోగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న జగపతి బాబు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో , లేడీస్ లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఈయనే అని అంటుంటారు విశ్లేషకులు. అయితే హీరో గా మార్కెట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాక , ఆయన విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి , సెకండ్ ఇన్నింగ్స్ ని ఏ రేంజ్ లో మొదలు పెట్టారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా , సూపర్ స్టార్స్ తో కలిసి నటిస్తూ , నేటి తరం ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. రీసెంట్ గానే ఆయన ‘పెద్ది’ చిత్రంలో పోషించిన అప్పలసూరి క్యారెక్టర్ కి ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ సినిమాతో జగపతి బాబు 3 వ ఇన్నింగ్స్ మొదలైంది అనే చెప్పాలి. అయితే ఆయన చాలా కాలం తర్వాత హీరో గా నటించిన ‘వదలా ‘ చిత్రం ఈ నెల 17 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది . ఈ చిత్రం లో లయ హీరోయిన్ గా నటించింది. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జగపతి బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా యాంకర్ జగపతి బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ రోజు మీకు కచ్చితంగా కావాల్సింది ఏంటి ?’ అని అడగ్గా , అందుకు జగపతి బాబు క్షణం కూడా ఆలోచించకుండా ‘సిగరెట్’ అని సమాధానం ఇచ్చారు. సిగరెట్ లేనిదే నా రోజు మొదలు అవ్వదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత ‘వదలా’ మూవీ గురించి జగపతి బాబు మాట్లాడుతూ ‘ఈ చిత్రం పూర్తి అయ్యి చాలా రోజులైంది. కానీ ఈ సినిమాకు బిజినెస్ జరగకపోవడం వల్ల విడుదల చేయలేకపోయాం. ఇప్పుడు సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మాత విడుదల చేస్తున్నారు. ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఆదరించాలి’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరోయిన్ ఆమని కోడలు హ్రితిక శ్రీనివాస్ ఇండస్ట్రీ కి పరిచయం కానుంది. ట్రైలర్ ని బట్టీ చూస్తుంటే , ఇందులో ఆమె క్రూరమైన విలన్ క్యారెక్టర్ లో నటించినట్టు అర్థం అవుతోంది. తొలిసినిమాతోనే ఒక సీనియర్ హీరోయిన్ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వస్తూ ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకోవడం సాహసమే. ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper