Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: బయట గౌతమ్ ని తిట్టిన నబీల్ సోదరుడు..లోపలకి వచ్చి టాప్...

Bigg Boss Telugu 8: బయట గౌతమ్ ని తిట్టిన నబీల్ సోదరుడు..లోపలకి వచ్చి టాప్ 2 లో పెట్టాడుగా..తమ్ముడు లాగే అన్న కూడా సేఫ్ గేమ్?

గౌతమ్ కి హౌస్ లో అడుగుపెట్టిన కొత్తల్లో నబీల్ తో ఎక్కువగా గొడవలు ఉండేవి. నామినేషన్స్ లో రెండవ వారం వీళ్ళ మధ్య పెద్ద వాగ్వాదం కూడా జరిగింది. ఈ సమయంలో నబీల్ సోదరుడు షార్జాల్ ఆఫ్రిది గౌతమ్ పై విరుచుకుపడుతూ సోషల్ మీడియా లో వీడియోలు అప్లోడ్ చేసాడు.

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ గ్రాఫ్ మొత్తం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఆరవ సీజన్ కి మించిన డిజాస్టర్ సీజన్ గా ఈ సీజన్ 8 నిలవబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో సీజన్ కి పూర్వ వైభవం వచ్చింది. ముఖ్యంగా గౌతమ్ గేమ్ చేంజర్ గా నిలిచాడు. మొదటి వారం లో పెద్దగా ఆడింది ఏమి లేదు కానీ, రెండవ వారం నుండి ఆయన తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. రెండవ వారం లో గౌతమ్ కి తక్కువ ఓట్లు పడడంతో ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఆరోజు మణికంఠ తనకి తానూ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడంతో గౌతమ్ సేవ్ అయ్యాడు. తనకి వచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ గౌతమ్ తన గ్రాఫ్ ని రోజురోజుకి పెంచుకుంటూ పోయాడు. చివరికి ఇప్పుడు ఆయన నిఖిల్ తో సరిసమానమైన ఓట్లను దక్కించుకుంటూ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ నీదా, నాదా అనే రేంజ్ లో నిలబడ్డాడు.

ఇదంతా పక్కన పెడితే గౌతమ్ కి హౌస్ లో అడుగుపెట్టిన కొత్తల్లో నబీల్ తో ఎక్కువగా గొడవలు ఉండేవి. నామినేషన్స్ లో రెండవ వారం వీళ్ళ మధ్య పెద్ద వాగ్వాదం కూడా జరిగింది. ఈ సమయంలో నబీల్ సోదరుడు షార్జాల్ ఆఫ్రిది గౌతమ్ పై విరుచుకుపడుతూ సోషల్ మీడియా లో వీడియోలు అప్లోడ్ చేసాడు. దీంతో నబీల్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఒక కంటెస్టెంట్ కి సంబంధించిన కుటుంబం, మరో కంటెస్టెంట్ పై ఇలా నెగటివ్ కామెంట్స్ చేయడం బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని, నబీల్ పెద్ద ప్లానింగ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. అయితే నిన్న నబీల్ కోసం వచ్చిన ఈయన స్టేజి మీదకు వచ్చి, నాగార్జున నబీల్ ని తప్ప మిగిలిన వాళ్ళని టాప్ 5 లో పెట్టమని కోరగా నబీల్ పెట్టిన లిస్ట్ ని చూసి షాక్ కి గురయ్యారు నెటిజెన్స్.

ఆయన దృష్టిలో నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణు ప్రియ టాప్ 5 లో ఉన్నారట. గౌతమ్ ని టాప్ 2 లో పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఇది కేవలం ఆడియన్స్ వద్ద ఆయన నబీల్ కి పెంచిన నెగటివిటీ ని తగ్గించుకోవడానికి స్ట్రాటజీ గా పెట్టినట్టు అనిపించింది. లేదా నిజంగానే అతనికి గౌతమ్ ఆట తీరు నచ్చి టాప్ 5 లో పెట్టి ఉండొచ్చు అని కొంతమంది నమ్ముతున్నారు. ఇదంతా పక్కన పెడితే నబీల్ కి గౌతమ్ ఇలా టాప్ 5 లోకి రాబోతున్నాడు అనే విషయం అసలు నచ్చడం లేదు. అతన్ని వచ్చే వారం నామినేట్ చేసి ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు హౌస్ లో గౌతమ్ వెర్సస్ నిఖిల్ నడిచింది. వచ్చే వారం నుండి నబీల్ వెర్సస్ గౌతమ్ నడిచే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper