BigBoss Prerana Interview : స్టార్ మా ఛానల్ లో ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ ని సంపాదించి, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ప్రేరణ కంభం(Prerana Kambam). ఈమె బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss Telugu 8) లో మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడి టాప్ 4 కంటెస్టెంట్ గా నిల్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈమెకు అవకాశాలు బాగా వస్తాయని అంతా అనుకున్నారు కానీ, కేవలం పలు ఎంటర్టైన్మెంట్ షోస్ కి మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కానీ, సీరియల్ కానీ లేదు. కానీ సోషల్ మీడియా లో ఈమెకు ఫ్యాన్స్ మాత్రం భీభత్సంగా ఉంటారు. ఇకపోతే రీసెంట్ గానే ఈమె తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ యష్మీ(Yashmi Gowda) తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆహా మీడియా లో తేజస్విని ముడివాడ యాంకర్ గా వ్యవజారిస్తున్న ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షో లో వీళ్లిద్దరు పాల్గొని కాసేపు సరదాగా ముచ్చటించారు. అయితే ఈ ఎపిసోడ్ ప్రారంభం లో ప్రేరరణ నైటీ మీద కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. తేజస్విని మాట్లాడుతూ ‘ఏమిటి ఇలా నైటీ మీద వచ్చేసావు?’ అని అడగ్గా, ‘ఇంట్లో కూర్చొని మాట్లాడే లాగా ఉండాలని నువ్వే చెప్పావ్ కదా, అందుకే ఇలా వచ్చాను’ అని అంటుంది ప్రేరణ. ‘నీకు దండం పెడుతా..వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకొని రా పో’ అని బలవంతంగా పంపిస్తుంది తేజస్విని. అయితే ప్రేరణ ఇలా నైటీ వేసుకొని రావడం పై సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇది చాలా ఓవర్ అయ్యింది కదూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె నైటీ లో అనేక సార్లు కనిపించింది.
ఇలా బహుశా ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కూడా కనిపించలేదు అనొచ్చు. ఇదంతా పక్కన పెడితే ప్రేరణ, యష్మీ కాంబినేషన్ లో వచ్చిన ఈ ‘కాకమ్మ కథలు’ ఎపిసోడ్ ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రారంభం నుండి చివరి వరకు మంచి ఫన్ తో సాగిపోయే ఈ ఎపిసోడ్ ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే ప్రేరణ ప్రస్తుతం ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిరాక్ లేడీస్’ సీజన్ 2 గేమ్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఈమె మొదటి సీజన్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండవ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా వచ్చింది. ప్రస్తుతం ఈ షో స్టార్ మా ఛానల్ లో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.