Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ల డ్రామా హైలెట్ అయ్యింది. వీరిద్దరూ చివరికి కప్ కోసం కూడా పోటీపడ్డారు. ఫినాలే రోజు అమర్ దీప్ కుటుంబం మీద దాడి జరిగింది. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర అవుతున్నా.. కోల్డ్ వార్ నడుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: ఆ హీరోయిన్ ఉందంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్టు కొట్టినట్టేనా..?
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ లో అమర్ దీప్ ని ఓడించి పల్లవి ప్రశాంత్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో ఎదుట పెద్ద గందరగోళం నెలకొంది. పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ వాహనాల మీద రాళ్లు రువ్వి, ప్రాపర్టీ నాశనం చేశారు. కాగా స్టూడియో నుండి బయటకు వెళుతున్న అమర్ దీప్ కారుపై దాడి జరిగింది.
అప్పుడు వాళ్ళు అన్నారు, నేను పడ్డాను. ఇక నేనేంటో చూపిస్తాను. నేను వాళ్ళ నోరు మూయించినా.. నేను నోరు మూసుకుని ఉన్న సిచ్యువేషన్ అంటే.. ఆ షోనే. ఏంట్రా నువ్వు చూపించేది అని కామెంట్ సెక్షన్ లో అనే వాళ్లకు చెబుతున్నా.. నేను చూపిస్తా.. అప్పటి వరకు ఆగదా.. అని చెప్తా అంతే.., అని అమర్ దీప్ ఫైర్ అయ్యాడు. ఆయన మాటలను బట్టి చూస్తే.. దాడి విషయం ఇంకా మర్చిపోలేదు. పల్లవి ప్రశాంత్ అభిమానుల మీద కోపంగానే ఉన్నాడని, కోల్డ్ వార్ నడుస్తుందని కొందరు భావిస్తున్నారు.
ఆ గుంపులో నుండి అమర్ దీప్ బయటపడటం కష్టమైంది. కారు అద్దాలు పగలకొట్టారు. తమపై జరిగిన దాడిపై అమర్ దీప్ సీరియస్ అయ్యాడు. కారులో అమ్మ, భార్య ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక లాభం లేదు, మీకు కావాల్సింది నేను కదా.. అని బయటకు దిగబోయాను. కుటుంబ సభ్యులు నన్ను ఆపారు, అని అమర్ దీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. అమర్ దీప్ పై జరిగిన దాడిని ఆయన మిత్రులు, సన్నిహితులు ఖండించారు. షోలో పల్లవి ప్రశాంత్ పై పలు సందర్భాల్లో అమర్ దీప్ మాటల దాడి చేసిన నేపథ్యంలో.. ఫ్యాన్స్ ఈ దాడికి పాల్పడ్డారు.
పలు టెలివిజన్ షోలలో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ మాత్రం కలిసి షో చేసేవారు కాదు. పల్లవి ప్రశాంత్ పాటు ఆయన అభిమానుల మీద అమర్ దీప్ కి కోపం తగ్గలేదని ఆయన లేటెస్ట్ కామెంట్స్ గమనిస్తే అర్థం అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ మాట్లాడుతూ..
Web Title: Amardeep cold war with pallavi prashanth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com