Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఊహించిన దానికంటే భిన్నంగా, ఆసక్తికరంగా సాగుతోంది. రాబోయే రోజుల్లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఊహించని ట్విస్టులు ఇవ్వబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా గత సీజన్స్ లో మొదటి రెండు ఎపిసోడ్స్ కి బిగ్ బాస్ ఆట ని అంత టఫ్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ సీజన్ లో మాత్రం, మొదటి ఎపిసోడ్ నుండే హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య రణరంగం క్రియేట్ అయ్యే పరిస్థితులను తీసుకొచ్చాడు. అంతే కాదు , ఈ వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక 90 శాతం ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి ఆట ప్రకారం చరణ్ , రామ్ ప్రసాద్ వంటి వారు హై రిస్క్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? , లేదా ఇప్పటి వరకు తక్కువ ఓటింగ్ ఉన్న వారిని హౌస్ నుండి తొలగిస్తారా ? అనేది సస్పెన్స్ గా మారింది.
ఒకవేళ తక్కువ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని తొలగించాలని అనుకుంటే కృష్ణుడు ఎలిమినేట్ అవుతాడు. అలా కాకుండా హై రిస్క్ జోన్ లో ఉన్న వారిని ఎలిమినేట్ చెయ్యాలని అనుకుంటే చరణ్ ని చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రామ్ ప్రసాద్ టీం లో దాదాపుగా అందరికీ పవర్స్ ఉన్నాయి. దాన్ని ఉపయోగించి వాళ్ళు ఆయన్ని సేవ్ చేయొచ్చు. కానీ చరణ్ టీం సభ్యుల వద్ద పవర్స్ తక్కువ, కాబట్టి ఇతనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చరణ్ ని ఎలిమినేట్ చేస్తే , రోహిత్ మానసికంగా బాగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య చాలా గొప్ప బాండింగ్ ఉంది. అంత మంచి రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రక్రియ లో భాగంగా ఎలాంటి సేఫ్ గేమ్ ఆడకుండా , చరణ్ ని హై రిస్క్ జోన్ లో పెట్టాల్సి వచ్చింది.
అలా పెట్టినందుకు ఇప్పటికే రోహిత్ చాలా బాధ పడుతున్నాడు. ఇప్పుడు తన స్నేహితుడు ఎలిమినేట్ అవ్వడానికి తాను కూడా ఒక కారణం అనే ఫీలింగ్ కలిగితే మాత్రం మానసికంగా బాగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే నేడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి, కంటెస్టెంట్ ని ఇంటికి పంపకుండా , ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచి, వచ్చే వారం హౌస్ లోకి పంపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా జరగొచ్చు అనేలా తయారైంది పరిస్థితి. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ ని చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే రోహిత్ ని సెలబ్రిటీలందరూ టార్గెట్ చేస్తున్నారు అని. ముఖ్యంగా త్రిగున్. కంటెస్టెంట్స్ అందరిలో రోహిత్ గురించి చెడు అభిప్రాయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత మంది అతని మాటలకు సరెండర్ అయిపోయారు, రోహిత్ పై చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు.
అలాంటి కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే వర్షిణి, కృష్ణుడు ముందు వరుసలో ఉంటారు. వీళ్లిద్దరు త్రిగున్ మాటల కారణంగా మారిపోయారు. అతను చెప్పిన ప్రతీ విషయాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కృష్ణుడు రోహిత్ పై నోరు పారేసుకున్నాడనే అనిపించింది. కచ్చితంగా ఈయన సరిగా ఆడకపోవడం వల్లే, రోహిత్ మొదటి టాస్క్ లో ఓడిపోతాడు. ఆ గిల్ట్ ఫీలింగ్ కృష్ణుడు లో ఇసుమంత కూడా లేదు, పైగా తప్పు మొత్తం రోహిత్ చేశాడు, అతను సరిగా సహకరించకపోవడం వల్లే గేమ్ ఓడిపోయాము అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు, లీడర్ లాగా ప్రవర్తిస్తున్నావు, నీలో అసలు లీడర్ అయ్యే లక్షణాలు కనిపించడం లేదు, నా మీద నీకు కుళ్ళుబోతు తనం ఉంది అంటూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడాడు. ఇక వర్షిణి అయితే సరైన పాయింట్స్ పెట్టింది కానీ, ఎందుకో ఈమెకు కూడా రోహిత్ మీద పీకల దాకా కోపం ఉన్నట్టు అనిపించింది.
ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యాక, కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా ఏర్పాటు చేశారు. రెడ్ టీం కి లీడర్ గా రోహిత్, బ్లూ టీం కి లీడర్ గా రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. రోహిత్ టీం లో షాలిని , చరణ్, శ్రేష్టి , అమన్, చైత్ర , వంశీ, ఝాన్సీ ఉన్నారు. ఇక బ్లూ టీం లో మిగిలిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ పౌచ్ ని తీసుకొచ్చే టాస్క్ ని పెడుతాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అందరూ కమాండో డ్రెస్సులు ధరించి, పౌచ్ లు తీసుకొస్తూ తమని తాము కాపాడుకోవాలి. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఒక టీం అటాకింగ్ మోడ్ లో ఉండి, గన్ తో దాడి చేస్తూ , పౌచ్ తీసుకోవడానికి వచ్చిన కంటెస్టెంట్ ని చంపాలి. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ టీం , రోహిత్ టీం కంటే తక్కువ టైం లో టాస్క్ ని ఫినిష్ చేస్తారు. పైన చెప్పిన హై రిస్క్ జోన్ ప్రక్రియ ఈ టాస్క్ ఆధారంగానే ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో రోహిత్, చరణ్ మధ్య బాండింగ్ ని చూస్తే, ఎలాంటి వారికైనా కన్నీళ్లు రాక తప్పదు. అంతటి ఎమోషన్ కి గురి చేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళ మధ్య బాండింగ్ ఇలాగే ఉంటుందా?, లేదా మధ్యలో గొడవలు ఏర్పడుతాయా అనేది.