Homeఎంటర్టైన్మెంట్Mega158: జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న '#Mega158' షూటింగ్.. ౩వ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..

Mega158: జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘#Mega158’ షూటింగ్.. ౩వ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..

Mega158: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే డైరెక్టర్ బాబీ తో ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాని ప్రస్తుతం అభిమానులు #Mega158 అనే పేరుతో పిలుస్తున్నాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు వెయ్యనటువంటి మాఫియా […]

Mega158: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే డైరెక్టర్ బాబీ తో ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాని ప్రస్తుతం అభిమానులు #Mega158 అనే పేరుతో పిలుస్తున్నాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు వెయ్యనటువంటి మాఫియా డాన్ పాత్రని ఇందులో చేయబోతున్నాడు. ఇది కచ్చితంగా అభిమానులకు పండుగ లాంటి వార్తనే. రీసెంట్ గానే పొలాచ్చి లో ఒక 12 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నివేత పెత్తురాజ్ మరియు అనశ్వర రాజన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి అట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి సంబంధించిన మూడవ షెడ్యూల్ ని ఈ నెల 19 న ప్రారంభించబోతున్నారు అట. చిరంజీవి , ప్రకాష్ రాజ్ లతో పాటు పలువురు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద ఈ సినిమాకు 105 వర్కింగ్ డేస్ ప్లాన్ చేసాడట డైరెక్టర్ బాబీ. ఇంత స్పీడ్ లో షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నాడంటే , కచ్చితంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు గట్టి ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతోంది. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ని చాలా కాలం తర్వాత వింటేజ్ కామెడీ టైమింగ్ లో చూపించే ప్రయత్నం చేసాడు.

అలాంటి సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ నుండి రాబోతున్న చిత్రం కాబట్టి , చిరంజీవి ని వేరే లెవెల్ లో చూపిస్తాడని బలంగా నమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే టాక్ ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అదే నిజమైతే సౌత్ లోనే ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో పెరుగుతాయి. ఒకే తరానికి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ వెండితెర పై కనిపిస్తే మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ కదా మరీ. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 22 న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper