Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. మొదటి షెడ్యూల్ ని పొలాచ్చి లో గ్రాండ్ లెవెల్ లో షూట్ చేశారు. చిరంజీవి, ప్రకాష్ రాజ్, నివేత పెతు రాజ్, అనశ్వర రాజన్ లపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తివు అయ్యాక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి , నేడు హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. అలా జెట్ స్పీడ్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఎట్టిపరిస్థితిలోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకొని రావాలని ప్లాన్.
ఇకపోతే నేడు డైరెక్టర్ బాబీ పొలాచ్చి షెడ్యూల్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ తో పాటుగా, కొన్ని కాలేజీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇందులో చిరంజీవి కి కూతురుగా అనశ్వర రాజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపైన అత్యధిక సన్నివేశాలు చిత్రీకరించినట్టు ఈ మేకింగ్ వీడియో లో చూపించారు. ఇక చివర్లో చిరంజీవి కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూపించి ‘జీవించెసావు అన్నయ్య’ అని అంటాడు డైరెక్టర్ బాబీ. మేకింగ్ వీడియో చూస్తుంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని అనిపిస్తోంది. పర్ఫెక్ట్ గా డీల్ చేస్తే మరోసారి ఇండస్ట్రీ హిట్ ని మెగాస్టార్ అవలీలగా అందుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతం లో డైరెక్టర్ బాబీ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాలో రవితేజ క్యారెక్టర్ మామూలు రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. ఈ చిత్రం లో కూడా అలాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసాడట డైరెక్టర్ బాబీ. ఈ క్యారెక్టర్ లో మోహన్ లాల్ కానీ , బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అనిల్ కపూర్ కానీ నటించే అవకాశం ఉందట. ఇకపోతే ఈ చిత్రంలో ఒక లేడీ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందని , ఆ క్యారెక్టర్ కోసం డింపుల్ హయాతి ని ఎంచుకున్నారని అంటున్నారు. త్వరలోన్ ఈ చిత్రం లో నటించబోయే నటీనటులకు సంబంధించిన అప్డేట్స్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.
