Aadarsha Kutumbam: ‘ విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ కి గుర్తొచ్చే సినిమాలు మల్లీశ్వరి , నువ్వు నాకు నచ్చావ్. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ అందించిన మాటలు , స్క్రీన్ ప్లే వాటిని కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా మార్చాయి. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా ఏళ్ళ తర్వాత మన ముందుకు రాబోతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ మేకర్స్ రోజుకి ఒక స్పెషల్ టీజర్ ని విడుదల చేస్తున్నారు. మొన్న వెంకటేష్ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, నిన్న ఆయన భార్య పాత్ర పోషిస్తున్న శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఇక నేడు వెంకటేష్ కూతురు క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ మరో టీజర్ ని విడుదల చేశారు.
ఇందులో వెంకటేష్ కూతురి పాత్రలో యువినా పార్థవి కనిపించబోతుంది. ఇందులో ఈమె పాత్ర పేరు సంపూర్ణ. ఇందులో ఈమె ఒక మెకానిక్ డ్రైవర్ ని ప్రేమిస్తుంది. ఈ పాత్ర కారణంగా వెంకటేష్ పడే ఇబ్బందులను , తద్వారా ఏర్పడే ఫన్ ని వెండితెర పై చూపించబోతున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే మొదటి సినిమా అయినప్పటికీ చాలా క్యూట్ గా నటించింది యువినా పార్థవి. ఆమెని చూస్తున్నంతసేపు మన ఇంట్లోని ఆడపిల్లని గుర్తుకువస్తోంది. అందుకే త్రివిక్రమ్ ఆమెని ఏరికోరి ఎంచుకున్నారు. మొత్తం మీద ఒక విచిత్రమైన ఫ్యామిలీ ఇది. అందుకే ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ని పెట్టినట్టు, గడిచిన మూడు టీజర్స్ ని చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా మిగిలిన క్యారెక్టర్స్ ని పరిచయం చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం లో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇందులో ఆయన తెలంగాణ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఓవరాల్ మూవీ కాన్సెప్ట్ ని తెలియజేసేలా చివర్లో ఒక టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని , ఆ తర్వాత మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేస్తారని అంటున్నారు. అలా అక్టోబర్ 2 వరకు నాన్ స్టాప్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. ఇక పోతే నేడు విడుదల చేసిన టీజర్ ని మీకోసం కింద అందిస్తున్నాము చూడండి.