Homeఎంటర్టైన్మెంట్Victory Venkatesh : వెంకటేష్ ఆ ఒక్కటి ఫాలో అయితే పాన్ ఇండియాలో రాణిస్తాడు...

Victory Venkatesh : వెంకటేష్ ఆ ఒక్కటి ఫాలో అయితే పాన్ ఇండియాలో రాణిస్తాడు…

Victory Venkatesh : సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో తను కూడా ఒకడిగా పేరు సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్… ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు నాలుగు పిల్లర్లుగా ఉండేవారు. వారి నుంచి వచ్చే సినిమాలను చూసిన ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు మరి అలాంటి నటులు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే 65 సంవత్సరాల పైబడిన ఏజ్ లో ఉన్నఈ హీరోలందరు కూడా […]

Victory Venkatesh : సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో తను కూడా ఒకడిగా పేరు సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్… ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు నాలుగు పిల్లర్లుగా ఉండేవారు. వారి నుంచి వచ్చే సినిమాలను చూసిన ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు మరి అలాంటి నటులు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే 65 సంవత్సరాల పైబడిన ఏజ్ లో ఉన్నఈ హీరోలందరు కూడా సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు. వాళ్ల స్టామినా ను బట్టి వాళ్ళు డిఫరెంట్ సినిమాలను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్లలో చిరంజీవి ని మినహాయిస్తే మిగిలినవారెవరు కూడా పాన్ ఇండియాలో సినిమాలను చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా పాన్ ఇండియాలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక వెంకటేష్ సైతం పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రానిస్తే మాత్రం ఆయన అక్కడ తప్పకుండా సక్సెస్ ని సాధిస్తాడు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కామెడీ ఎంటర్టైనర్లు చేయగలిగితే అతన్ని మించిన వారు ఎవరు ఉండరనేది వాస్తవం.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తే మాత్రం అక్కడ అతనికి స్టార్ డమ్ దక్కుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాని తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ లాంటి సినిమాలతో సక్సెస్ ను సాధించాడు.

‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో అతను చేసింది తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ అయినప్పటికి ఆ సక్సెస్ క్రెడిట్ కూడా తనకే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాబోయే రోజుల్లో ఆయన పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం కామెడీ యాక్షన్ జానర్ లను నమ్ముకుని ముందుకు సాగితే అతనికి గొప్ప ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper