Unknown Facts: ఇండియా లో నేడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న ఎంతో మంది కెరీర్స్ లో, కొన్ని మైల్ స్టోన్స్ కారణంగానే ఆ స్థాయికి చేరుకున్నారు అని చెప్పొచ్చు. ఉదాహరణకు బాషా చిత్రం ముందు వరకు రజినీకాంత్ కేవలం తమిళనాడు కి మాత్రమే పరిమితం. కానీ ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు , సౌత్ లో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. అదే విధంగా ‘ఖైదీ’ చిత్రానికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఒక సాధారణ హీరో మాత్రమే. ‘ఖైదీ’ తర్వాత అసాధారణ హీరో గా మారాడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక అక్కినేని నాగార్జున సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ ని శివ చిత్రానికి ముందు , శివ చిత్రం తర్వాత అని విభజించవచ్చు. శివ కి ముందు నాగార్జున కెరీర్ లో అత్యధిక శాతం ఫ్లాపులే ఉన్నాయి.
నాగేశ్వర రావు కొడుక్కి అసలు నటనే రాదు , ఇతను ఇండస్ట్రీ లో కొనసాగడం చాలా కష్టం అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే శివ పడింది , పెద్ద సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఎలా అయితే వీళ్లకు ఈ సినిమాలు మైల్ స్టోన్స్ గా నిలిచాయి , విక్టరీ వెంకటేష్ కి కూడా ‘చంటి’ సినిమా అలాంటి మైల్ స్టోన్ గా నిల్చింది. ఈ సినిమాకు ముందు వెంకటేష్ కి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ ఆడియన్స్ లో స్టార్ అనిపించుకునే రేంజ్ స్టామినా ని సంపాదించుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ‘చంటి’ సినిమా చేసాడో , టాప్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా చేరిపోయాడు. ఆరోజుల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఒక ప్రభంజనం. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పట్టారు. ఆరోజుల్లో థియేటర్స్ బయట ఈ సినిమాకు క్యూలు కిలోమీటర్ల రేంజ్ లో ఉండేవి. 100 రోజులకు పైగా హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకున్న సెంటర్స్ చాలానే ఉన్నాయి. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో , ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ చెక్కు చెదరని బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా ముందుగా తమిళం లో తెరకెక్కింది. శివాజీ గణేశన్ కొడుకు ప్రభు హీరో గా తమిళం లో ‘చిన్నతంబి’ అనే చిత్రం తెరకెక్కింది. ఆరోజుల్లో తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం అప్పట్లో నిర్మాత కే ఎస్ రామారావు చాలా గట్టి ప్రయత్నాలే చేసాడు. రవిరాజా పిన్ని శెట్టి మొదటి ఛాయస్ రాజశేఖర్.
ఈ సినిమాని ముందుగా రాజశేఖర్ కి చూపించాడట రవిరాజా పిన్ని శెట్టి. ఆయనకు స్టోరీ చాలా బాగా నచ్చింది కానీ, అప్పటికే రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉంది, ఇలాంటి అమాయకపు క్యారెక్టర్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం కారణంగా , ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేశాడట. ఒకవేళ రాజశేఖర్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే నేడు ఆయన కెరీర్ ఇలా ఉండేది కాదేమో. పెద్ద స్టార్ హీరో గా చలామణి అయ్యేవాడేమో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ ని తిరుగులేని స్టార్ గా మలచడం లో రాజశేఖర్ కూడా పరోక్షంగా ఒక కీలక పాత్ర పోషించాడని విశ్లేషకులు అంటున్నారు. 1992 వ సంవత్సరం , జనవరి 10, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఆరోజుల్లో 16 కోట్ల గ్రాస్ అంటే సాధారణమైన విషయం కాదు. షేర్ వసూళ్లు దాదాపుగా 9 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఈ రికార్డు ని అదే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ బ్రేక్ చేసింది. కానీ మిగిలిన హీరోలకు ‘చంటి’ రికార్డు ని అందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంతే కాదు , చంటి చిత్రం ఆరోజుల్లోనే 40 డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుందట. షిఫ్ట్ సెంటర్స్ తో కలిపి దాదాపుగా 60 సెంటర్స్ ఉంటాయని అంటున్నారు. అతి తక్కువ ప్రింట్స్ తో సినిమాలు విడుదలయ్యే ఆరోజుల్లో 60 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది ఒక సంచలన రికార్డు. ఇవన్నీ చూసిన తర్వాత రాజశేఖర్ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అనిపిస్తుంది కదా?, ఒకవేళ రాజశేఖర్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే ఇంతే పెద్ద హిట్ అయ్యేదా?, ఇంతకంటే పెద్ద హిట్ అయ్యేదా?, లేదా ఫ్లాప్ అయ్యేదా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.