Homeఎంటర్టైన్మెంట్డిసెంబర్ 15 నుండి రాజకీయ సన్నివేశాల్లో 'మహేష్' !

డిసెంబర్ 15 నుండి రాజకీయ సన్నివేశాల్లో ‘మహేష్’ !

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, మిగిలిన డైరెక్టర్స్ లాగే పరుశురామ్ కూడా హీరో ఉన్నప్పుడు హీరో సీన్స్ ను, హీరో అందుబాటులో లేనప్పుడు మిగిలిన సీన్స్ ను షూట్ చేసుకుంటూ.. మొత్తానికి సినిమాని త్వరగా పూర్తి చేయడానికి బాగానే సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా, ఈ సినిమా రాజకీయ అంశాల పై ప్రధానంగా సాగుతుందని.. అందుకే డిసెంబర్ 15 […]

Sarkaru Vaari Paata
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, మిగిలిన డైరెక్టర్స్ లాగే పరుశురామ్ కూడా హీరో ఉన్నప్పుడు హీరో సీన్స్ ను, హీరో అందుబాటులో లేనప్పుడు మిగిలిన సీన్స్ ను షూట్ చేసుకుంటూ.. మొత్తానికి సినిమాని త్వరగా పూర్తి చేయడానికి బాగానే సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా, ఈ సినిమా రాజకీయ అంశాల పై ప్రధానంగా సాగుతుందని.. అందుకే డిసెంబర్ 15 నుండి ఫిల్మ్ సిటీలో ఉన్న ఓ పార్టీ హౌస్ టైప్ లో వేసిన సెట్ లో రాజకీయ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని.. మహేష్ పైనే ఆ సీన్స్ తీయబోతున్నారని తెలుస్తోంది.

Also Read: ‘నయనతార’లా జాన్వీ కపూర్ మెప్పిస్తోందా ?

ఇక ఈ చిత్రం కోసం పరుశురామ్ తమిళనాడులోని నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారట.. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారట. అయితే ఆ అంశం బ్యాంకు సొమ్ము ఎగవేతదారులకి సంబంధించిందే ఆట. ఏది ఏమైనా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైతే మహేష్ నుండి మరో స్ట్రాంగ్ మెసేజ్ మూవీ వచ్చినట్టే. ఇక సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడు.

Also Read: కలెక్టర్ తో బాలయ్య బాబు లవ్ స్టోరీ !

తన తండ్రిని మోసం చేసి.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఏమి చేశాడు ? ఎలాంటి ఎత్తులు వేశాడు ? ఈ క్రమంలో మహేష్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి ? అనే అంశాల చుట్టూ ఈ సినిమా నడుస్తోందని.. పైగా ఈ సినిమాలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉండబోతుందని.. అందుకే మహేష్ చాలా కాలం తర్వాత లవర్ బాయ్‌ లుక్ లోకి మారాడని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాని ప్రెస్టీజియస్ మూవీగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper