Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయిన కూడా ఆయన డైరెక్ట్ గా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. నిజానికి రాజమౌళి ఉన్నాడు కాబట్టే ఆయన అంత పెద్ద సాహసమైతే చేస్తున్నాడు. లేకపోతే మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాతో అంతకుమించిన ఆనందాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహేష్ బాబు మొదటి నుంచి కూడా సక్సెసుల్లో ఉన్న దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తాడంటూ కొన్ని వార్తలైతే వచ్చేవి…
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
కానీ కెరియర్ స్టార్టింగ్ లో అందరితో సినిమాలను చేశాడు. కానీ ఒకానొక టైమ్ లో మహేష్ బాబు సక్సెస్ లు సాధించిన దర్శకులకు మాత్రమే అవకాశాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక తనకు సక్సెస్ ఇచ్చిన తర్వాత వేరే హీరోలతో ఫెయిల్యూర్ ని సంపాదించుకున్న దర్శకులను సైతం తను పట్టించుకోవడం లేదు.
ఇప్పటివరకు ఆయనతో సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్న కూడా వారికి అవకాశం ఇవ్వడం లేదు. కానీ గతంలో తనకి భారీ సక్సెస్ ని అందించిన పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల, కొరటాల శివ లాంటి దర్శకులతో మరో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇష్టపడడం లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పే కథలు నచ్చడం లేదా అంటే నచ్చుతున్నాయి.
కానీ వాళ్లకు సక్సెస్ లేవు అలాగే దానికి తోడుగా వాళ్లకు ఇప్పుడు మార్కెట్ కూడా పెద్దగా లేకపోవడం వల్లే మహేష్ బాబు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నాడట… సినిమా ఇండస్ట్రీలో ఎవరికి మార్కెట్ ఉంటే వాళ్లతోనే సినిమాలు చేయడానికి హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని ఆసక్తి చూపిస్తారనేది వాస్తవం…