Varanasi movie special video update: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. టైటిల్ గ్లింప్స్ వీడియో తప్ప, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఏ కంటెంట్ కూడా విడుదల అవ్వకపోయినప్పటికీ , ఈ రేంజ్ అంచనాలు పెరిగాయంటే అందుకు కారణం రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. #RRR తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకున్న తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడం, దానికి తోడు ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవెల్ లో తెరకెక్కిస్తుండడం వల్ల ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోయే ఈ సినిమాకు ఇప్పటి నుండే ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రొమోషన్స్ ని మొదలు పెట్టాడు రాజమౌళి.
అంటార్కిటికా లో లేటెస్ట్ గా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న టీం , నిన్న మెక్సికో లో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కి హాజరయ్యారు. రాజమౌళి , మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారని అంతా అనుకున్నారు కానీ , కేవలం రాజమౌళి తనయుడు కార్తికేయ మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇక్కడ ఆయన ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పడమే కాకుండా, ‘వారణాసి’ మేకింగ్ వీడియో మరియు కొన్ని కీలక సన్నివేశాలను ప్రదర్శించాడు. ఆ సన్నివేశాలను ఈవెంట్ కి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు వీక్షించాడు. ఈ సన్నివేశాల్లోని కొన్ని షాట్స్ ని కట్ చేసి సోషల్ మీడియా లో అభిమానుల కోసం ఒక చిన్న టీజర్ గా విడుదల చేస్తారేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అలాంటివి జరగకపోవడం తో వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురి చేశారు.
నిన్ను పెంచి ఇంతటి వాడిని చేసింది తెలుగు ఆడియన్స్ , అలాంటిది ముందు మాకు ఇలాంటి సన్నివేశాలను చూపించాల్సింది పోయి , మెక్సికో జనాలకు చూపిస్తావా , ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కనీసం అక్కడ వీడియో షూట్ చేసి ఎవరైనా అభిమానులు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆ ఈవెంట్ కి మొబైల్ ఫోన్లు , కెమెరాలు తీసుకొని రాకూడదు అనే రూల్ ఉంది కాబట్టి సోషల్ మీడియా లో లీక్ అవ్వలేదు. లేదంటే ఈ పాటికి వారణాసి సన్నివేశాలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యుండేవి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.