Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy Padayatra 2026: జగన్ పాదయాత్రలో సంచలనాలు!

YS Jagan Mohan Reddy Padayatra 2026: జగన్ పాదయాత్రలో సంచలనాలు!

YS Jagan Mohan Reddy Padayatra 2026: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పాదయాత్రకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఆయన 16 నెలల పాటు పాదయాత్ర చేశారు. ఈసారి మాత్రం 18 నుంచి 20 నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఆయన పాదయాత్రకు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్ర మునుపటి మాదిరిగా కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈసారి ఒక ప్లాన్ చేస్తున్నారట. ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నారట. నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న సమాచారం ఉంది. పాదయాత్ర చేసే సమయానికి పునర్విభజన అనేది ఒక కొలిక్కి రానుంది. తద్వారా పెరిగిన నియోజకవర్గాలతో కలిపి అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా పాదయాత్ర బాధ్యతలను వారికి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

* నేరుగా అభ్యర్థుల ప్రకటన..
2017లో పాదయాత్ర ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ప్లీనరీ ( party plainery )నిర్వహించి పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు ప్రకటన చేశారు. నవరత్నాలు ప్రకటించారు. పనిలో పనిగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. కానీ ఈసారి మాత్రం ఎటువంటి ప్రకటనలు ఉండవని తెలుస్తోంది. నేరుగా పెరిగిన నియోజకవర్గాలతో కలిపి అభ్యర్థులను ప్రకటించి పాదయాత్ర మొదలు పెడతారని తెలుస్తోంది. తద్వారా ముందుగానే టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తే నేతలు బాగా కష్టపడుతారు అనేది ఒక అంచనాగా తెలుస్తోంది. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా ఒక ఊపు తేవాలని చూస్తున్నారు. పైగా పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా చేయాలని భావిస్తున్నారు.

* అప్పట్లో లోకేష్ కు అడ్డంకులు..
2023లో లోకేష్( Nara Lokesh) పాదయాత్ర కొనసాగింది. ఆ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోకేష్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పాదయాత్రలో మైకులను సైతం తీసుకుపోయారు. వాహనాలను సైతం పట్టుకుపోయారు. పోలీసుల రక్షణ లేకుండా పోయింది. చివరకు లోకేష్ పాదయాత్రను మరింత డామేజ్ చేసేందుకు సోషల్ మీడియా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎవరు టిడిపి నేతలు తెలుసుకోలేని పరిస్థితి అప్పట్లో పాదయాత్ర లో ఉండేది. దానిని తట్టుకొని పాదయాత్రను పూర్తి చేయగలిగారు లోకేష్. ఇప్పుడు కచ్చితంగా ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి సైతం ఉంటుంది. మరి ఆయన తట్టుకొని నిలబడగలరా అన్నది చూడాలి.

* బలమైన అధికారపక్షం..
కళ్ళముందు బలమైన అధికారపక్షం ఉంది. గతంలో తెలుగుదేశం( Telugu Desam), జనసేన, బిజెపి విడివిడిగా ఉండేవి. తెలుగుదేశం ప్రభుత్వం సైతం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దారి పొడవునా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేసేసారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు గుర్తుగా వైసీపీ రంగులు వీరవిహారం చేశాయి. అయితే ఈసారి అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం సైతం కలుగజేసుకుంటుంది. అటువంటి చర్యలను మూడు పార్టీలు అడ్డుకుంటాయి కూడా. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. వీటికి తోడు అనేక పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చాలా ఇబ్బందికరమే. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular