Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Preview Show: రేపే ఆ ప్రాంతంలో 'వారణాసి' స్పెషల్ ప్రివ్యూ షో.. పూర్తి...

Varanasi Movie Preview Show: రేపే ఆ ప్రాంతంలో ‘వారణాసి’ స్పెషల్ ప్రివ్యూ షో.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Varanasi Movie Preview Show: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. ఎప్పుడో ఏప్రిల్ 7 , 2027 న విడుదల అవ్వబోయే సినిమాకు […]

Varanasi Movie Preview Show: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. ఎప్పుడో ఏప్రిల్ 7 , 2027 న విడుదల అవ్వబోయే సినిమాకు ఈ నెలలోనే విడుదల అవ్వబోతుందా అనే రేంజ్ మేనియా ని క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికా లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత మూవీ టీం లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. ఇదంతా పక్కన పెడితే రేపు మెక్సికో లో జరగబోయే CCXP ఈవెంట్ లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

రాజమౌళి తో పాటు ‘వారణాసి’ మూవీ టీం మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొనబోతుంది. ‘వారణాసి’ ని ప్రత్యేకంగా ఐమాక్స్ కోసం తయారు చేయబడుతుంది అని పోస్టర్స్ నుండే ప్రమోట్ చేసుకోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ ఐమాక్స్ స్క్రీన్ మీద మెక్సికో అభిమానుల కోసం ‘వారణాసి’ చిత్రం లోని కొన్ని కీలక సన్నివేశాలను ప్రివ్యూ షో లాగా అభిమానులకు చూపించబోతున్నారు అట. అంతే కాకుండా ఇదే ప్రివ్యూ లో ‘వారణాసి’ మేకింగ్ సీన్స్ కూడా చూపిస్తారట. ఈ విషయాన్నీ రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళి తో కలిసి ప్రత్యేకంగా రికార్డు చేసిన వీడియో ని రేపు విడుదల చేయబోతున్నారు. CCXP మెక్సికో అంటే కామిక్ కాం ఎక్స్పీరియన్స్ మెక్సికో అని అర్థం. లాటిన్ అమెరికా లో ప్రతీ ఏడాది జరిగే అతి పెద్ద పాప్ కల్చర్ ఇది. ఇందులో కొత్త సినిమాలు , సిరీస్ లకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి.

అంతే కాదు ఈ వేదిక పై ప్రతిష్టాత్మక సినిమాలకు సంబంధించిన ఎక్సక్లూసివ్ కంటెంట్ ని అందరికంటే ముందే చూడొచ్చు. సినీ అభిమానులకు ఇదొక గొప్ప డ్రీం ఈవెంట్. రాజమౌళి ముందుగా ‘వారణాసి’ లోని గూస్ బంప్స్ సన్నివేశాలను చూసే అదృష్టం మెక్సికో జనాలకు కల్పిస్తున్నాడు. మరి ఆ సన్నివేశాలను ఎవరైనా మొబైల్ లో రికార్డు చేసి , సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ మొబైల్ కెమెరా వంటివి లోపలకు తీసుకొచ్చేందుకు అనుమతి లేదట. ఐమాక్స్ థియేటర్స్ కోసం ఈ చిత్రం లో గూస్ బంప్స్ రప్పించే మూడు యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట. ఆ సన్నివేశాలని చూపించబోతున్నట్టు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by CCXP México (@ccxp_mx)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper