HomeNewsChanakya Neeti: చాణక్య నీతి: ఈ మూడు పనులు చేసేవారి ఇంట్లో డబ్బే డబ్బు..

Chanakya Neeti: చాణక్య నీతి: ఈ మూడు పనులు చేసేవారి ఇంట్లో డబ్బే డబ్బు..

Chanakya Neeti: మౌర్య సామ్రాజ్యానికి చెందిన అపర చాణక్యుడు రాజకీయవేత్తగా ఎంతోమందికి సుపరిచితుడే. అయితే ఆయన మనుషుల జీవితాల కు సంబంధించి అప్పుడే కొన్ని సూచనలు చేశాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు? ఎలాంటి పనులు చేస్తాడు? అనే విషయాలు చెప్పాడు. ఇదే సందర్భంలో ఆర్థిక విషయాలను కూడా నేటి తరం వారికి అర్థమయ్యే విధంగా అప్పుడే వివరించాడు. వీటిలో ముఖ్యంగా డబ్బు ఇంట్లో కళకళలాడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పక చేయాలని […]

Chanakya Neeti: మౌర్య సామ్రాజ్యానికి చెందిన అపర చాణక్యుడు రాజకీయవేత్తగా ఎంతోమందికి సుపరిచితుడే. అయితే ఆయన మనుషుల జీవితాల కు సంబంధించి అప్పుడే కొన్ని సూచనలు చేశాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు? ఎలాంటి పనులు చేస్తాడు? అనే విషయాలు చెప్పాడు. ఇదే సందర్భంలో ఆర్థిక విషయాలను కూడా నేటి తరం వారికి అర్థమయ్యే విధంగా అప్పుడే వివరించాడు. వీటిలో ముఖ్యంగా డబ్బు ఇంట్లో కళకళలాడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పక చేయాలని చాణక్యుడు తెలిపాడు. ఆ ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చాణుక్యుడు తన చాణక్యనీతి పుస్తకం ద్వారా ఎన్నో విలువైన విషయాలను అందించాడు. ఇవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. శతాబ్దాలు గడుస్తున్నా చాలామంది చాణక్యుడి విలువైన సూచనలు పాటిస్తూ వస్తున్నారు. ఇందులో ఆర్థిక సమస్యలు.. వాటి నుంచి బయటపడే మార్గం గురించి వివరించాడు. అయితే వీటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం..

గౌరవం:
కొంతమంది తమకు డబ్బు ఉందని అహంకారంతో ఉంటారు. ఈ సమయంలో ఎదుటివారిని చిన్నచూపు చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి విలువ లేదా గౌరవం ఇవ్వరు. ఇలా ఇవ్వకుండా తామే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి డబ్బు కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని చాణక్యనీతి పుస్తకం ద్వారా తెలుస్తుంది. అతి తొందర్లోనే వీరు డబ్బులు లేని వారిగా మారిపోయి వీరి ఇంట్లో డబ్బు నిలవకుండా ఉంటుందని చెప్పారు. అందువల్ల డబ్బు నిలవాలంటే ఇతరులకు గౌరవం ఇవ్వాలని ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వలేని వారికి ఇంట్లో ధనలక్ష్మి విలువ ఉండదని చెప్పారు.

ఆహారం వృథా:
ఒక మనిషి బతకడానికి ఆహారం తప్పనిసరిగా కావాలి. అలాంటి ఆహారం ఎక్కువగా ఉన్నవారు దానిని వృధా చేయకూడదు. అవసరమైనంత మేరకే ఆహారం తీసుకుని మిగతాది ఇతరులకు దానం చేయాలి. ఎవరి ఇంట్లో అయితే అన్నం వృధా కాకుండా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీ దేవత నిల్వ ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అందువల్ల లక్ష్మీ అవతారమైన అన్నపూర్ణ స్వరూపమైన ఆహారంను ఎప్పటికైనా వృధా చేయవద్ద తెలుపుతుంది.

ఐకమత్యం:
ప్రస్తుత కాలంలో చాలామంది చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోతున్నారు. అయితే ఇలా విడిపోతే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చాణక్యనీతి తెలుపుతుంది. ఎందుకంటే కలిసి ఉండటం వల్ల కొన్ని ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులను అందరూ కలిసి వాడుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బు ఖర్చు ఎక్కువగా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవత ఉంటుందని చాణక్యనీతి తెలుపుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper