Khushboo's Daughter
Khushboo’s Daughter : ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లుగా రాణించారు. అలా రాణించిన హీరోయిన్లలో కుష్బూ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తన సినిమా కెరియర్లో హీరోయిన్ ఖుష్బూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అప్పట్లో కుష్బూ అందానికి అందరూ ఫిదా అయ్యేవారు. అభిమానులు ఆమెకు గుడి కట్టి కూడా ఆరాధించేవారు. అప్పట్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ తిరుగులేని హీరోయిన్ గా రాణించింది.ఈమె చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కుష్బూ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో కూడా నటించి మెప్పించింది. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కుష్బూ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ బిజీగా గడుపుతున్నారు. ఈమెకు తెలుగుతోపాటు తమిళ్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ అభిమానులు గుడి కూడా కట్టారు అంటే ఆమెకున్న క్రేజ్ అర్థమవుతుంది. ప్రస్తుతం కుష్బూ భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలను తగ్గించారు. అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత ఇటీవల ఆమె సినిమాలలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. రజినీకాంత్ నటించిన అన్నట్టేలే లో నటించారు.
2021లో ఈ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఈమె వాళ్ళు సినిమాలలో నటించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, అలాగే హీరో శర్వానంద్ నటించిన ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలలో కూడా కుష్బూ నటించారు. సోషల్ మీడియాలో కుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమె తన సోషల్ మీడియా ఖాతాతో అభిమానులతో చేరువలో ఉంటారు. కుష్బూ సమాజంలో జరిగే విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా కుష్బూ కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక హీరోయిన్ ఖుష్బూ తమిళ్ దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక కూతురు పేరు అవంతిక. ఈమె విదేశాల్లో చదువుకుంటుంది. అందంలో అవంతిక తల్లికి ఏ మాత్రం తీసిపోదు. తన అందంతో ఈ బ్యూటీ అందరినీ ఫిదా చేస్తుంది. విదేశాలలో చదువుకుంటున్న అవంతిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్గా తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం అవంతికకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Khushboos daughter is keeping guys awake with her glamorous photos
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com