ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ప్లే -11 లో చోటు తగ్గించుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో వారిద్దరిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికాలో జరిగిన టి20 సిరీస్లో తిలక్ వర్మ రెండు సెంచరీలు బాదాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు పలు మ్యాచ్లలో కీలక పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరికి ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో ప్లే -11 లో చోటు దక్కుతుందని అందరు భావించారు. అయితే తిలక్ వర్మకు ఆ అవకాశం లభించగా.. నితీష్ కుమార్ రెడ్డికి ఎక్స్ ట్రా ప్లేయర్ గా అవకాశం దక్కింది. మహమ్మద్ సిరాజ్ కు సిరీస్లో అవకాశం దక్కలేదు. ఐతే పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్టర్లు కేవలం రిజర్వు ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేశారు.. హార్థిక్ పాండ్యాకు బ్యాకప్ గా మాత్రమే నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంది.
తెలుగు క్రికెట్ అభిమానుల వర్షం
బుధవారం జరుగుతున్న తొలి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించడం పట్ల తెలుగు క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. ఇటీవల కాలంలో కీలకవర్మ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే అతనికి వన్డే ఫార్మాట్ లో అవకాశం లభించలేదు. తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్లో అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో మాత్రం అతడికి అవకాశం ఇచ్చారు. ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. భారత జట్టు గత ఏడాది జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. 4-1 తేడాతో ట్రోఫీ అందుకుంది.. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగే ఐదు t20 మ్యాచ్ల సిరీస్ ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు ఇవే
టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) (కెప్టెన్), సంజు శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ ( Abhishek Sharma), తిలక్ వర్మ!Tilak Verma), అర్ష్ దీప్ సింగ్ ( Arsh deep Singh), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), రింకూ సింగ్ (Rinku Singh), అక్షర్ పటేల్ (Akshar Patel), రవి బిష్ణోయ్(Ravi Bishnoi), వరుణ్ చక్రవర్తి (Varun Chakravarti).
ఇంగ్లాండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్) Jose butler, ఫిలిప్ సాల్ట్ (Philip salt), బెన్ డకెట్ (Ben docket), బ్రూక్ (brook),లివింగ్ స్టోన్ (livingstone), బెతెల్ (betal), ఓవర్టన్ (overton), అత్కిన్ సన్(Atkinson), జోప్రా ఆర్చర్ (jofra Archer), అబ్దుల్ రషీద్ ( Abdul Rashid), వుడ్ (wood).
మ్యాచ్ జరుగుతున్న వేదిక; కోల్ కతా, ఈడెన్ గార్డెన్స్
లైవ్ ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ.