Keeravani: అత్యంత ప్రతిష్టాత్మక షోగా పేరుగాంచిన పాడుతా తీయగా షో ప్రతిష్ట మసకబారింది. యువ గాయని ప్రసస్తి సదరు షోలో తనకు జరిగిన అన్యాయం, అవమానాలు బయటపెడుతూ వరుస వీడియోలు చేస్తుంది. ఈ క్రమంలో కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ పక్షపాత వైఖరి అవలంభించారని ప్రసస్తి ఆరోపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా వెడ్డింగ్ ఈవెంట్స్ లో తాను పాడాను. వెడ్డింగ్ ఈవెంట్స్ లో పాడే వారు నా దృష్టిలో సింగర్స్ కాదు, అని కీరవాణి అవమానించారని ప్రసస్తి అన్నారు. లిరిక్స్ మర్చిపోయిన సింగర్స్ కూడా టాప్ లో ఉన్నారు. నన్ను మాత్రం కావాలనే కిందకు లాగేశారు అనేది ప్రసస్తి ఆవేదన చెందారు.
Also Read: నటుడు సునీల్ పొలిటికల్ ఎంట్రీ! మేటర్ తెలిస్తే మైండ్ బ్లాక్
సింగర్ సునీత మీద కూడా ప్రసస్తి కీలక ఆరోపణలు చేశారు. ఈ వివాదం పై భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు ప్రసస్తికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు కీరవాణి, సునీతలకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ వివాదం పై సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ స్పందించారు. ఆయన కీరవాణి పై తీవ్ర ఆరోపణలు చేశారు. పాడుతా తీయగా జడ్జెస్ తో పాటు, నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీద మండిపడ్డాడు.
కీరవాణి గురించి నాకు 7-8 సంవత్సరాలుగా తెలుసు. అందుకు ముందు 40 ఏళ్లుగా కూడా తెలుసు. అతని గురించి కొందరు నాకు డైరెక్ట్ గానే చెప్పారు. అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్స్ తో స్కూల్ ఏజ్ గర్ల్స్ కావాలని చెప్పేవాడట. కీరవాణి ఒక వ్యభిచారి. అతని మీద పోక్సో(POCSO) కేసు పెట్టాలి. సింగర్స్ ఎక్స్పోజ్ చేయాలని ఇబ్బంది పెడుతున్న జడ్జెస్, నిర్మాతల మీద కూడా పోక్సో కేసు పెట్టాలని ఆయన అన్నారు. టెలివిజన్ గ్లామర్ ఇండస్ట్రీ కాదు. తెర వెనక ఉండి పాడే వాళ్ళను ఇలా వేధించడం సరికాదు. దశాబ్దాల క్రితం నుండే మ్యూజిక్ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఉందని గీతా కృష్ణ అన్నారు.
కీరవాణి మీద దర్శకుడు గీతాకృష్ణ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కీరవాణి టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఆయన కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఆ సాంగ్ కి లిరిక్స్ అందించిన చంద్రబోస్ సైతం ఆస్కార్ వేదిక మీద మెరిశారు. వీరిద్దరూ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.