IPL 2025 : మారుతున్న పరిస్థితుల్లో క్రికెట్ లో అంపైర్లు కేవలం పప్పెట్ లా మారిపోతున్నారు. ప్రతి డెసిషన్ కు టెక్నాలజీ పై ఆధార పడి కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఐపిఎల్ మ్యాచులో వారి పరిస్తితి మరీ దిగజారిపోయింది. కనీసం బాల్ బ్యాట్ కు తగిలిందో లేదో కూడా చూడడం లేదు. క్లోజ్ గా ఉండే అంపైర్ కు స్పష్టంగా కనిపిస్తుంది. అయినా వాటిని చూడకుండా థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయడం. నో బాల్స్ ను పరిశీలించడం లేదు. థర్డ్ అంపైర్ లేని సమయంలో కూడా అంపైర్లు చక్కగా నిర్వహించారు. టెక్నాలజీ సహాయం లేకుండా ఏ పొరపాట్లు చేయకుండా ఆటను నిర్వహించారు. మరి ఇప్పుడు ఎందుకంత ఒత్తిడి అనుభవిస్తున్నారు. దీనివల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సాధారణంగా బ్యాటింగ్ చేసేప్పుడు అందరికన్నా ఎక్కువగా బ్యాట్స్ మన్ కు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.
Also Read : ధోని ఉన్నా.. చెన్నై జట్టుకు ఏంటి ఈ దుస్థితి.. సురేష్ రైనా ఏం చెప్పాడంటే..
ఈ విషయంలో వారికి సరైన రీతిలో బౌలింగ్ వేస్తున్నారా..? బౌలింగ్ సైడ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చక్కగా ఆటను నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంపైర్ లపై ఉంటుంది. కానీ వారే ఒత్తిడికి గురై ఏ డెసిషన్ ఇస్తున్నారో తెలియని అయోమయంలో పడుతున్నారు. ఈ మధ్య ఐపీఎల్ లో సన్ రైజర్స్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఔట్ ఇచ్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. ఔట్ సైడ్ లెగ్ స్టంప్ వెళ్తున్న బాల్ ను కనీసం బ్యాట్, ప్యాడ్ వేటికి తగలలేదు. కీపర్, బౌలర్ అప్పీల్ చేయలేదు. ఎందుకో చేయి పైకి లేపిన ఎంపైర్ మొహమాటంతో ఫింగర్ పైకెత్తి ఔట్ అంటూ డిక్లేర్ చేశాడు. అది స్పష్టంగా కనిపించింది. ఆ విషయంలో కనీసం లెగ్ ఎంపైర్ సలహా తీసుకొని ఉండాల్సింది. ఆ తరువాత థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేయాల్సి ఉండేది. కానీ ఆ ఎంపైర్ ఈ విషయంలో చేసిన తొందరపాటు మూలంగా ఒక మంచి బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఎన్నో అపవాదులు, ట్రోల్స్ ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విషయంలో ఎంపైర్ చేసిన తప్పిదం తీవ్ర ప్రభావానికి కారణమైంది. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉండేది.
కానీ కనీసం వీటిపై సమీక్ష కూడా లేదు. టెక్నాలజీ వచ్చిందని చెప్పి ఎంపైర్లు తమ విధులను ఎంపైర్ లు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సన్ రైజర్ వర్సెస్ సీఎస్ కే మ్యాచులో కూడా థర్డ్ ఎంపైర్ నాట్ఔట్ చెప్పిన తరువాత కన్ఫ్యూషన్ కు గురైన ఎంపైర్ ఔట్ చూపించి, తిరిగి సర్దుకోవడం కనిపించింది. ఇలాంటి పరిస్థితికి కారణాలు ఏమై ఉంటాయనేది బోర్డు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంతర్గతంగా ఎంపైర్ లు ఒత్తిడికి గురవుతున్నారా., డెసిషన్ తీసుకునే విషయంలో తడపాటుకు కారణాలు ఏమై ఉంటాయి.
వారు తమ విధులు నిర్వర్తించాల్సిన విషయంలో ఫ్రీ ఆఫ్ మైండ్ తో వ్యవహరించేలా ఎలాంటి పరిస్థితులు కల్పించాల్సి ఉంటుందనే విషయంలో చర్యలకు ఉపక్రమించాలి. ఎంపైర్ల ఎంపిక నుంచి వారు ఫీల్డులో వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా పరిశీలించేందుకు జ్యూరీ కచ్చితంగా వ్యవహరించాలి. లేకుంటే వారి వ్యవహార శైలి ఆటపై ప్రభావం చూపుతుంది. కోట్లాది క్రికెట్ అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తుంది..
Also Read : ఇషాన్ కిషన్ అవుట్ కాదా? మరి ఎందుకు వెళ్లిపోయినట్టు?