ఆర్ ఎక్స్ 100 చిత్రం తో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకొన్న హీరో కార్తికేయ. ఆ చిత్రం తరవాత కార్తికేయ హీరో గా గత ఏడాది మూడు చిత్రాలు విడుదల చేయడం జరిగింది .” హిప్పీ’, ‘గుణ 369 ‘, ‘ 90 ఎం ఎల్ ” సినిమాలు ఆయన నుండి వచ్చాయి. ఐతే వాటిలో ‘గుణ 369’ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కార్తికేయ హీరో గా అల్లు అరవింద్ జీ ఏ 2 బ్యానర్ లో ” చావు కబురు చల్లగా ” సినిమా చేస్తున్నాడు కాగా ఆ చిత్రం .షూటింగ్ కూడా మొదలైంది. లాక్ డౌన్ కారణం గా ఆగింది .
లాక్ డౌన్3.0 లో నిబంధనలు ఇవే!
కాగా కార్తికేయ తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ వార్త బయటి కొచ్చింది. కాగా ఆ న్యూస్ నిజమేనని తెలుస్తోంది . మే ఒకటో తారీఖున అజిత్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ నటించే విషయం వెల్లడయింది `.ఖాకీ ‘ (కార్తీ చిత్రం ) ఫేమ్ ‘ హెచ్ వినోత్ ‘ దర్శకత్వంలో అజిత్ “వాలిమై ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .ఇక ఆ మూవీలో కార్తికేయ విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది . కాగా గత ఏడాది నాని హీరోగా నటించిన ‘ గ్యాంగ్ లీడర్ ‘ చిత్రం లో కూడా కార్తికేయ విలన్ గా నటించడం జరిగింది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Karthikeya to play the villain in valimai
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com