Mythri Movie Makers Ajith Film: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్(Thala Ajith) ఈ ఏడాది ‘విడాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో ‘విడాముయార్చి’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 250 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది అజిత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ కి చెందిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. అజిత్ తో సినిమా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆయనతో భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని ఉందంటూ ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాతలు చెప్పుకొచ్చారు.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
అనుకున్నట్టుగానే ఈ కాంబినేషన్ మళ్ళీ కుదిరింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి దర్శకత్వం వహించిన అద్విక్ రవిచంద్రన్ నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం అజిత్ 200 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడం వల్లే అని కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త. అజిత్ కి అంత పెద్ద మార్కెట్ ఇంకా ఏర్పడలేదు అనేది వాస్తవం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి షేర్ కలెక్షన్స్ విషయానికి వస్తే కేవలం 128 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. ఓటీటీ, ఆడియో రైట్స్, మరియు సాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే ఈ చిత్రానికి దాదాపుగా 300 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగి ఉండొచ్చు. ఈ చిత్రానికి అజిత్ 75 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అది నిర్మాతలకు కూడా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 85 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు కానీ, అజిత్ ఏకంగా 200 కోట్లు అడిగేసరికి మాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి, ఈ చిత్రం నుండి వాళ్ళు తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు తప్పుకున్నంత మాత్రాన ఈ సినిమా ఏమి ఆగిపోలేదు. గతం లో అజిత్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆయన నేను రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వలేనని, దానికి బదులుగా ఓటీటీ, సాటిలైట్ రైట్స్ ఇస్తానని అన్నాడట. అందుకు అజిత్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈమేరకు అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేశారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని కేవలం అభిమానుల కోసం ఎక్సక్లూసివ్ గా తీసిన అద్విక్ రవిచంద్రన్, ఇప్పుడు తీయబోయే సినిమా మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉంటుందని అంటున్నారు.