Hari Hara Veera Mallu : మొన్నటివరకూ తమిళనాట చూశాం.. ఇప్పుడు కర్ణాటకకు ఆ భాషాభిమానం పాకింది. అవును.. తమిళులకు భాషాభిమానం ఎంత అంటే ఆ రాష్ట్రంలో ఏకంగా తమిళ కోసం పార్టీలు పుట్టాయి.. హిందీ సహా ఇతర భాషలను వారి రాష్ట్రాల్లో ఎంట్రీ లేకుండా చేశాయి. ఇప్పుడు కర్ణాటక ప్రజలకు భాషాభిమానం విపరీతంగా పెరిగింది. ఈ మధ్య ఓ కన్నడ బ్యాంకులో హిందీ మాట్లాడిన మేనేజర్ పై ఏకంగా ఖాతాదారులు పెద్ద గొడవకు దిగి కన్నడ రాని వారిని బ్యాంకుల్లో ఉంచొద్దు అంటూ ఏకంగా ఉద్యమమే చేశారు.
ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాలను కన్నడలో డబ్ చేయలేదని.. తెలుగులో చూడము అంటూ ఆ రాష్ట్రంలోని థియేటర్స్ లో బాయ్ కాట్ చేసేశారు. అంతటి వేడి గల ప్రస్తుత తరుణంలో ‘హరిహర వీరమల్లు’ మూవీని కర్ణాటకలోనూ రిలజ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ‘హరిహర వీరమల్లు’ బ్యానర్లను తెలుగులో ఎందుకు పెట్టలేదని అక్కడి ప్రజలు, కార్యకర్తలు థియేటర్ల వద్ద ఆందోళనకు దిగారు.
ఏకంగా పవన్ కళ్యాణ్ పోస్టర్లను చించిపడేశారు. హరిహర వీరమల్లు బ్యానర్లు కన్నడ భాషలో లేవని కన్నడిగులు చించేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి.
కన్నడ భాష కోసం.. తమ భాషలోనే సినిమాలు ఉండాలని.. కన్నడలోనే డబ్ చేయాలని.. పోస్టర్లు, పేర్లు కూడా కన్నడ భాషలోనే ఉండాలంటూ పవన్ కళ్యాణ్ ‘హరిహర’ సినిమాకు కన్నడవ్యాప్తంగా షాకులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
హరిహర వీరమల్లు బ్యానర్లు కన్నడ భాషలో లేవని చింపిన కన్నడిగులు pic.twitter.com/iQQM16AOVO
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2025