
కరోనా ప్రబలిన దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుందని ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వొద్దని సూచించింది. ఆయా దేశాలు లాక్‌డౌన్ సడలింపులపై ఆయా దేశాలు ఒకటి రెండుసార్లు బాగా ఆలోచించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగ సీనియర్ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన చాలా దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయని ఆయన హెచ్చరించారు. వైరస్ ప్రభావంలేని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగాయని తెలిపారు. ఇలాంటివి ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.
లాక్‌డౌన్ తో కుప్పకూలుతున్న ప్రింట్ మీడియా
కరోనా వైరస్ ను లాక్‌డౌన్, సామాజిక దూరంతోనే కట్టడి చేయగలమని ఆయన తెలిపారు. జనాభా ఎక్కువగా భారత్, అమెరికా దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణమాలుంటాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం అన్నిదేశాలు కరోనా మహమ్మరి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఆయాదేశాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. ఇదిలా ఉంటే భారత్ లో మరోరెండు వారాలు లాక్‌డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే లాక్‌డౌన్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులు చేసింది. రెడ్ జోన్లను పూర్తిగా కట్టడి చేస్తూ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్ అమలులో సడలింపు చేస్తుండటంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.