spot_img
Homeఎంటర్టైన్మెంట్Junior NTR Tweet About Dandora: 'దండోరా' చిత్రం పై జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్..శివాజీ...

Junior NTR Tweet About Dandora: ‘దండోరా’ చిత్రం పై జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్..శివాజీ పై ప్రశంసల వర్షం!

Junior NTR Tweet About Dandora: మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ నటీనటులతో సంబంధం లేకుండా ఒక రేంజ్ లో ఆదరిస్తారు. ముక్కు మొహం తెలియని హీరోలు కూడా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అలాంటి మంచి మనసు మన తెలుగు ఆడియన్స్ కే సొంతం. భాషతో సంబంధం లేదు, మనకు సినిమా నచ్చితే చాలు బ్లాక్ బస్టర్ హిట్ చేసేయడమే. అలా తమిళం సినిమా ఇండస్ట్రీ నుండి డబ్బింగ్ సినిమాలతో మన ముందుకొచ్చిన రజినీకాంత్,సూర్య, కమల్ హాసన్ , కార్తీ చివరికి విజయ్ సినిమాలను కూడా ఆదరించాము. అదే విధంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని చేసిన సందరభాలు ఉన్నాయి. అలాంటి టాలీవుడ్ ఆడియన్స్ అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను ఆదరించంలో కొన్ని కారణాల వల్ల విఫలమైన సందర్భాలు ఉన్నాయి.

అలా విఫలమైన సినిమాల్లో ఒకటి ‘దండోరా ‘. శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవి కృష్ణ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం లోనే శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తుల గురించి కామెంట్స్ చేసి తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ వివాదం బాగా హైలైట్ అయ్యింది కానీ, దండోరా చిత్రాన్ని ఆ వివాదం అవుట్ షైన్ చేసిందని, ఫలితంగా సినిమాకు ఉన్నటువంటి పాజిటివ్ టాక్ జనాల్లోకి బలంగా వెళ్ళకపోవడం వల్లే ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది అని విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట . ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.

అమెజాన్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఇంత మంచి సినిమాని ఆదరించడం లో ఈసారి మన తెలుగు ఆడియన్స్ విఫలం అయ్యారు అంటూ కామెంట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించి వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘కాసేపటి క్రితమే దండోరా చిత్రాన్ని చూసాను. ఈ చిత్రం ప్రతీ ఒక్క మనిషిని ఆలోచింపచేసే విధంగా, చాలా పవర్ ఫుల్ గా ఉంది. శివాజీ , నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ వంటి వారు అద్భుతమైన నటన కనబర్చారు. ఇలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించినందుకు డైరెక్టర్ మురళి కాంత్ కి సెల్యూట్. ఇంత గొప్ప సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఆయన కారణంగా ఈ సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ, డిజిటల్ మీడియా లో పెద్ద హిట్ గా ఈ చిత్రం నిలబడబోతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper