Rakul Preet Singh- Rana: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపుని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు దగ్గుపాటి రానా. విక్టరీ వెంకటేష్ తర్వాత దగ్గుపాటి కుటుంబం నుండి హీరో గా వచ్చిన మూడవ జెనెరేషన్ నటుడు ఈయన. తొలిసినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లీడర్’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా రానా కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా భిన్నమైన స్టోరీ సెలెక్షన్స్ తో మన ముందుకు వచ్చాడు కానీ, ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అలా కెరీర్ వెళ్తున్న సమయం లో బాహుబలి సిరీస్ లో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సిరీస్ తర్వాత రానా కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చెయ్యని రానా, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే రానా గత కొంత కాలం క్రితమే మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమెతో పెళ్ళికి ముందు రానా చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు అనేది ఓపెన్ సీక్రెట్. అలా ఆయన ప్రేమాయణం నడిపిన వారిలో ప్రముఖ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే రానా తో ప్రేమలో పడిన ఈమె, సుమారుగా రెండేళ్ల పాటు డేటింగ్ కూడా చేసింది. అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మంచి స్నేహం గానే ఉంటున్నారు, పార్టీలలో కలిసినప్పుడు చక్కగానే పలకరించుకుంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోవడం విశేషం.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Is that the reason why rakul preet singh and ranas marriage stopped
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com