Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి ఈమె సినిమాలు చేసింది , సూపర్ హిట్స్ ని అందుకుంది. అయితే ఈమధ్య కాలం లో ఈమెకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో , టాలీవుడ్ లో అవకాశాలు రావడం ఆగిపోయాయి. అప్పటి నుండి బాలీవుడ్ వైపే ఫుల్ ఫోకస్ పెట్టిన ఈమె, వరుసగా అక్కడ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. కానీ కమర్షియల్ గా అక్కడ కూడా ఈమెకు మంచి సక్సెస్ లు దొరకలేదు. అయితే ఇప్పుడు ఈమెకు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సూర్పనక్క క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది.
రీసెంట్ గానే ఆ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన కామిక్ బుక్ ని విడుదల చేశారు. అందులో రకుల్ ప్రీత్ స్కెచ్ లను AI కి మారిస్తే దేవకన్య లాగా అందంతో మీరిపోతుంది. ఆ లుక్ ని మీరు క్రింద చూడొచ్చు. వాస్తవానికి ఈ చిత్రం లో ఆమె పోషిస్తున్నది రాక్షసి పాత్ర. అంటే విలన్ క్యారెక్టర్ అన్నమాట. అయినప్పటికీ ఇంత అందం తో కనిపించడాన్ని చూసి , ఇలాంటి అమ్మాయిని రాక్షసి గా చూపించడానికి మనసు ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీత పాత్ర పోషించిన సాయి పల్లవి కంటే , రకుల్ ప్రీత్ సింగ్ వెయ్యి రెట్లు అందంగా కనిపిస్తోంది. ఇలాంటి హీరోయిన్ కి సీత పాత్ర ఇవ్వకుండా, రాక్షసి పాత్ర ఇస్తారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ డైరెక్టర్ నితీష్ తివారీ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.
రామాయణం మన అందరికీ తెలిసిందే, సూర్పనక్క ముక్కు ని లక్షణుడు కోసేస్తాడు , రకుల్ ప్రీత్ ముక్కు కి వీరాభిమానులు ఉన్నారు, ఇప్పుడు ఆమె ముక్కుని కోసే సన్నివేశాన్ని అభిమానులు తీసుకోగలరా అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే రామాయణం కి సంబంధించిన ట్రైలర్ ని ముంబై ప్రదర్శించారు. మన టాలీవుడ్ పాత్రికేయులు మొత్తం ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వాళ్ళ నుండి ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24 న సోషల్ మీడియా లో ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.
