spot_img
Homeఎంటర్టైన్మెంట్Independence Day 2023: దేశాన్ని షేక్ చేసిన దేశభక్తి సినిమాలివీ

Independence Day 2023: దేశాన్ని షేక్ చేసిన దేశభక్తి సినిమాలివీ

Independence Day 2023: ప్రస్తుతం మనుషులను వేరు చేసేది కులం అయితే మనసులను ఒక్కటి చేసేది దేశం. మన అందరి అణువణువూ ప్రవహించేది రక్తం… కానీ మనందరి రక్తం రంగు ఒక్కటే… అదే భారతీయం. దేశం తర్వాత మళ్ళీ మనల్ని ఒక్కటి చేసింది సినిమా! ఇక దేశం, సినిమా ఒకటి అయితే. అనగా సినిమాలే దేశభక్తి పైన వస్తే మనం ఆదరించకుండా ఉంటామా..?? దేశభక్తి అనే ఎమోషన్ కు అందరిని థియేటర్లకు రప్పించే శక్తి ఉంది.
ఈ సినిమాలకు భాషాభేదాలు, మాస్, క్లాస్ విభజనలతో సంబంధం ఉండదు. మరి అలా మన దేశాన్ని షేర్ చేసిన దేశభక్తి సినిమాలను మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చూద్దాము..

ఆర్ఆర్ఆర్

అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఫిదా చేసిన దేశభక్తి సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా, ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చారిత్ర‌క చిత్రం ఆస్కార్ సైతం సంపాదించుకుంది. ఇద్ద‌రు పోరాట‌యోధులు క‌లిసి బ్రిటీష్ వారిపై చేసిన పోరాటాన్ని హీరోయిజం, ఎమోష‌న్స్ మేళ‌వించి శక్తివంతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.

మేజ‌ర్

ముంబై ఉగ్ర‌దాడుల్లో క‌న్నుమూసిన ఎన్ఎస్‌జీ క‌మాండో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా దేశ‌భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో తెరకేకిన సినిమా మేజర్. అడివిశేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు

భారతీయుడు

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా,, అకాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.

ఖడ్గం

ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే వస్తుంది అంతే తెలుగు ఛానల్ లో తప్పకుండా వేసే సినిమా ఖడ్గం.1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రం చూస్తున్నంత సేపు మనల్ని ఒక దేశభక్తి ట్రాన్స్లోకి తీసుకెళ్లి పోతుంది ఈ చిత్రం.

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్

హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినవిప్లవకారుడు భగత్ సింగ్ గురించి ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో భగత్ సింగ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ నటించారు.

గదర్- ఏక్ ప్రేమ్ కథ

విభజన, హిందూ-ముస్లిం అల్లర్ల సమయంలో జరిగిన ప్రేమకథ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper